BSNL New Year Offer: పండగ చేస్కోండి.. BSNL న్యూ ఇయర్ ప్లాన్ ఆఫర్.. జస్ట్ రూ.251కే 100GB డేటా, లైవ్ టీవీ, OTT యాప్స్!
BSNL New Year Offer : బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ఏడాదిలో సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. సరసమైన ధరలో డేటా, లైవ్ టీవీ, ఓటీటీ యాప్స్ యాక్సస్ చేయొచ్చు.
BSNL New Year Offer
BSNL New Year Offer : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అద్భుతమైన ఆఫర్.. భారతీయ మొబైల్ యూజర్ల కోసం కొత్త ఏడాదిలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ అందిస్తోంది. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ తక్కువ ధరకే డేటా, ఎంటర్‌టైన్మెంట్ అందించే స్పెషల్ న్యూ ఇయర్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్‌ను కంపెనీ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. రీఛార్జ్ నుంచి ఎక్కువ వాల్యూ కోరుకునే యూజర్లకు బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు.
ఈ ఆఫర్ జనవరి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అధిక డేటా వినియోగం, ఆన్‌లైన్ షోలు, లైవ్ టీవీపై డిమాండ్ పెరగడంతో బీఎస్ఎన్ఎల్ కొత్త యూజర్లతో పాటు ప్రస్తుత యూజర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ హై-స్పీడ్ డేటా, వాయిస్ కాలింగ్, పాపులర్ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా యాక్సెస్ అందిస్తుంది.
కొత్త ఏడాది ప్లాన్ల వివరాలు :
రూ. 251కు లభించే ఈ న్యూ ఇయర్ డేటా ప్లాన్‌లో 30 రోజుల పాటు 100GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా మీ సాధారణ రీఛార్జ్ కూడా కొత్త ప్లాన్ మాదిరిగా మార్చుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. వ్యాలిడిటీ వ్యవధిలో యూజర్లు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ప్రీమియం ఆప్షన్లతో సహా 400 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయొచ్చు.
లైవ్ టీవీతో పాటు ఈ ప్లాన్ యూజర్లు సినిమాలు, షోలు, క్రీడల కోసం 23 ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ జాబితాలో జియోహాట్‌స్టార్, సోనీలైవ్ ఉన్నాయి. భారీ కంటెంట్ యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్యామిలీలు, యువ యూజర్లకు సరైన పోటీ చెప్పువచ్చు.
Read Also : Samsung Galaxy A55 5G : వారెవ్వా.. శాంసంగ్ A55 5Gపై ఊహించని ఆఫర్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు
బీఎస్ఎన్ఎల్ ఇతర ప్లాన్లలో మార్పులివే :
బీఎస్ఎన్ఎల్ ఇతర BiTV ప్యాక్‌లలో కూడా డేటా లిమిట్ విస్తరించింది. ఇప్పుడు, రూ.225 ప్యాక్ 3GB రోజువారీ డేటాతో వస్తుంది. రోజువారీ బ్రౌజింగ్, ఆన్‌లైన్ వీడియోలను చూడొచ్చు. రూ.347 ప్యాక్ 2.5GB రోజువారీ డేటాతో పాటు రూ.485 ప్యాకేజీలో రోజువారీ డేటా అదే బెనిఫిట్ అందిస్తుంది.
లాంగ్ టైమ్ యూజర్ల కోసం రూ.2,399 ప్యాకేజీ 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అలాగే ప్యాకేజీపై ఎక్కువ వ్యాలిడిటీని కూడా అందిస్తుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల యూజర్లతో సంబంధం లేకుండా ప్రతి ప్యాక్‌లో కాలింగ్ బెనిఫిట్స్, రోజువారీ SMS సర్వీసులను పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ కొత్త ఏడాది ఆఫర్లు ఇవే :
ఈ కొత్త ఏడాది ఆఫర్‌ను జనవరి 31, 2026 వరకు పొందవచ్చు. ఆసక్తి కలిగిన యూజర్లు వెంటనే రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ సరసమైన ప్లాన్‌లపై అద్భుతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ ఆఫర్ ఇంటర్నెట్ కాల్స్, ఎంటర్ టైన్మెంట్ సింగిల్ ప్యాకేజీలో అందించనుంది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు BSNL యాప్ లేదా ఏదైనా రీఛార్జ్ ఆప్షన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
