Samsung Galaxy A55 5G : వారెవ్వా.. శాంసంగ్ A55 5Gపై ఊహించని ఆఫర్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

Samsung Galaxy A55 5G : శాంసంగ్ గెలాక్సీ A55 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2025లో మీ బడ్జెట్ ధరలోనే ఇంటికి తెచ్చుకోవచ్చు..

Samsung Galaxy A55 5G : వారెవ్వా.. శాంసంగ్ A55 5Gపై ఊహించని ఆఫర్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

Samsung Galaxy A55 5G

Updated On : December 26, 2025 / 5:01 PM IST

Samsung Galaxy A55 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2025 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై అదిరిపోయే డీల్ అందిస్తోంది.

తద్వారా రూ. 16,900 కన్నా ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. మీరు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని అనుకుంటే మాత్రం శాంసంగ్ గెలాక్సీ పాపులర్ A సిరీస్ కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A55 5G డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫ్లిప్‌కార్ట్ డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్) భారత మార్కెట్లో రూ.39,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.24,269కు లిస్ట్ అయింది. రూ.15,730 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు మీరు రూ.1,214 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

Read Also : Google Pixel 9a : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. గూగుల్ పిక్సెల్ 9aపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ A55 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద, ఈ హ్యాండ్‌సెట్ ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంకా, శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది.