US Israel Iran War: ఇరాన్ స్కూల్స్‌పై ఇజ్రాయెల్ దాడి.. 51 మంది చిన్నారులు మృతి
మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్ లను టార్గెట్ చేసింది. ట్రంప్-నెతన్యాహు హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మిస్సైల్స్ ను ఎక్కుపెట్టింది.
Representative Image (Image Credit To Original Source)
US Israel Iran War: మిడిల్ ఈస్ట్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. మినాబ్ లోని స్కూల్ పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 51 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. 60 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇజ్రాయల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ కమాండర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయల్ టార్గెట్ చేసింది. మరోవైపు టెహ్రాన్ ను విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది ఇరాన్ జాతీయ భద్రతా మండలి.
మరోవైపు ఇజ్రాయల్ పై ఇరాన్ మళ్లీ అటాక్ చేసింది. ఇజ్రాయల్ పై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ పై ఇజ్రాయల్-అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ఇరాన్ పై దాడులు వెంటనే ఆపాలని రష్యా డిమాండ్ చేసింది. ఇరాన్ పై దాడిని పలు దేశాలు ఖండించాయి. మరోవైపు యుద్ధంతో విమానాలను పలు విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అంతా యుద్ధ వాతావరణం అలుముకుంది.
ముందు ఇజ్రాయల్, అమెరికా ఇరాన్ పై దాడులు జరపగా.. కౌంటర్ అటాక్ తో విరుచుకుపడింది ఇరాన్. మిడిల్ ఈస్ట్ లోని అమెరికన్ ఆర్మీ బేస్ లను టార్గెట్ చేసింది. ట్రంప్-నెతన్యాహు హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా మిస్సైల్స్ ను ఎక్కుపెట్టింది. నార్త్ ఇజ్రాయల్, బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ మిస్సైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు మేము ఇస్తాం అంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిరూపంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడులతో యూఏఈలో ఒకరు మృతి చెందారు. ఖతార్ రాజధాని దోహాలో తాజాగా మరిన్ని పేలుళ్లు సంభవించాయి.
