Legal Guide : తల్లిదండ్రుల ప్రతి ఆస్తిపై పిల్లలకు పూర్తి హక్కులు ఉంటాయా? అసలు చట్టం ఏం చెబుతుందంటే?
Legal Guide : తల్లిదండ్రుల ప్రతి ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుందా? చట్టం ప్రకారం ఆస్తి వంశపారంపర్యంగా వచ్చిందా లేక సొంత సంపాదనతో సంపాదించిందా? అనేదానిపై పిల్లల హక్కులు ఆధారపడి ఉంటాయి.
- Sreehari A
- Updated on- May 2, 2026 / 05:58 PM IST
Legal Guide ( Image Credit : Gemini AI )
- తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు చెందుతుందా?
- ప్రతి ఆస్తిని పిల్లలు పంచుకోవచ్చా?
- వంశపార్యంగా ఆస్తి లేదా స్వార్జిత ఆస్తిపై హక్కు ఉంటుందా?
- ఏయే ఆస్తులపై పిల్లలకు హక్కు ఉంటుంది?
Legal Guide : తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు చెందుతుందా? తల్లి లేదా తండ్రి సంపాదించిన ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుందా? ఉండదా? చాలామంది తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ప్రతి ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుందని భావిస్తుంటారు. అయితే, వాస్తవం వేరు. చట్టం ప్రకారం.. ఆస్తి వంశపారంపర్యమైనదా లేక స్వార్జితమా అనేదానిపై పిల్లల హక్కులు ఆధారపడి ఉంటాయి.
అదే పిల్లలు ఎప్పుడు, ఎంత వాటాను తీసుుకోవాలో (Legal Guide) నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇల్లు, భూమి చాలా ఏళ్లుగా ఫ్యామిలీలో భాగంగా ఉంటే.. తల్లిదండ్రుల ఆస్తిలో తమకు వాటా లభిస్తుందని పిల్లలు అనుకోవచ్చు. అయితే, చట్టపరంగా పూర్తి హక్కు ఉండకపోవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పిల్లలకు ఎప్పుడు హక్కులు ఉండవు? :
తండ్రి సొంత కష్టార్జితంతో డబ్బుతో ఆస్తిని సంపాదించుకుంటే.. స్వార్జిత ఆస్తి అంటారు. ఇలాంటి ఆస్తిపై తండ్రికి పూర్తి హక్కులు ఉంటాయి. అతను ఆ ఆస్తిని ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు లేదా వీలునామా ద్వారా ఎవరికైనా ఇవ్వవచ్చు.
Read Also : Small UPI Payments : UPIలో గేమ్ చేంజర్ ఫీచర్.. చిన్న పేమెంట్లకు ఇక PIN అవసరం లేదు.. ఎలా వాడాలి?
1956 తర్వాత ఒక తండ్రి తన తండ్రి నుంచి ఆస్తిని వారసత్వంగా పొందినప్పటికీ, చట్టపరంగా అది అతని స్వార్జిత ఆస్తిగానే పరిగణిస్తారు. దానిపై పిల్లలకు జన్మహక్కు ఉండదు. ఈ నియమాన్ని హిందూ వారసత్వ చట్టం, 1956, అనేక సుప్రీం కోర్టు తీర్పుల ద్వారా స్పష్టం చేస్తుంది.
పిల్లలకు హక్కులు ఎప్పుడు లభిస్తాయి? :
ఆస్తి వంశపారంపర్య ఆస్తి అయితే.. అంటే అది 4 తరాలుగా విభజన లేకుండా సంక్రమించినట్లయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి వారసత్వంగా పొందుతారు. ఈ రకమైన ఆస్తి హిందూ అవిభక్త కుటుంబంలో భాగంగా పరిగణిస్తారు.
తండ్రి ఒక్కడే నిర్ణయాలు తీసుకోలేరు. ఆస్తి అమ్మకం లేదా ట్రాన్స్ ఫర్ చేసేందుకు సహభాగస్వాములందరి సమ్మతి అవసరం. కుటుంబంలో మైనర్ ఉన్నట్లయితే వారి తరపున వారి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
పూర్వీకుల ఆస్తిని ఎలా గుర్తిస్తారు? :
ఆ ఆస్తి 4 తరాల పాటు వారసత్వంగా సంక్రమించి ఉండాల్సింది. అందులో ఎలాంటి విభజన ఉండకూడదు. ఇందులో పిల్లలు తమ తండ్రి పూర్వీకుల నుంచి వారసత్వంగా పొంది ఉండవచ్చు. ఏదైనా ఆస్తిని బహుమతిగా వీలునామా ద్వారా లేదా స్వయంగా కొనుగోలు చేస్తే అది పూర్వీకుల ఆస్తిగా పరిగణించరు.
స్వార్జిత ఆస్తి : యజమాని మాటే చెల్లుతుంది. పిల్లలకు స్థిరమైన హక్కులు ఉండవు.
వంశపారంపర్య ఆస్తి : పిల్లలకు పుట్టుకతోనే వాటా ఉంటుంది.
