LIC Saral Pension Plan : LIC సరళ్ పెన్షన్ ప్లాన్.. ఒకసారి చెల్లిస్తే చాలు.. జీవితాంతం పెన్షన్ పొందొచ్చు.. ప్రయోజనాలు, అర్హతలివే..!

LIC Saral Pension Plan : ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన ప్లాన్ తీసుకుంటున్నారా? ఒకసారి ప్రీమియం చెల్లిస్తే లైఫ్ మొత్తం పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇది ఎలా పొందాలంటే?

LIC Saral Pension Plan

LIC Saral Pension Plan : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఎల్ఐసీ ‘సరల్ పెన్షన్ ప్లాన్’ ద్వారా రిటైర్మెంట్ (LIC Saral Pension Plan) తర్వాత జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రదాత (IRDAI) నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం అందుబాటులో ఉంది. ఈ పథకంలో చేరడం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా జీవనం కొనసాగించవచ్చు.

Read Also : Nothing Phone 3 : అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది.. ధర, లాంచ్ డేట్ వివరాలు లీక్..!

LIC పెన్షన్ ప్లాన్ ఎందుకు అవసరం? :
ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన అనేది సింగిల్ ప్రీమియం.. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇమ్మీడియట్ యాన్యుటీ పాలసీ. ఒకేసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత, జీవితాంతం క్రమం తప్పకుండా పెన్షన్ పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్..

ప్రత్యేక ఫీచర్లు ఇవే :
కనీస వార్షిక పెన్షన్ : ఈ పథకంలో కనీస వార్షిక మొత్తం రూ. 12వేలు. నెలవారీ పెన్షన్ ఎంచుకుంటే.. నెలకు కనీసం రూ. 1,000, త్రైమాసికానికి రూ. 3వేలు, అర్ధ వార్షికానికి రూ. 6వేలు ఎంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అవసరానికి అనుగుణంగా పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఎల్ఐసీ ప్లాన్ కొనుగోలు చేసిన ఒక నెలలోపు పెన్షన్ ప్రారంభమవుతుంది. మీరు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

లోన్ సౌకర్యం :
ఈ LIC ప్లాన్ ద్వారా పాలసీదారుడు పాలసీ ప్రారంభించిన 6 నెలల తర్వాత రుణం తీసుకోవచ్చు. అత్యవసర ఖర్చుల కోసం డబ్బు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. గరిష్ట రుణ మొత్తం కూడా రుణంపై చెల్లించే మొత్తం వార్షిక వడ్డీ వార్షికం (పెన్షన్)లో 50 శాతానికి మించకూడదు.

పన్ను ప్రయోజనాలు :
LIC సరళ్ పెన్షన్ ప్లాన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 10(10D) కింద పన్ను మినహాయింపుకు అర్హత పొందవచ్చు. పెన్షన్, టాక్స్ సేవింగ్స్ కూడా పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
ఈ ప్లాన్ అన్ని వయసుల వారికి అందుబాటులో ఉంది.
వయస్సు అర్హత : కనీస వయస్సు 40 ఏళ్ల నుంచి గరిష్టంగా  80 ఏళ్లు వరకు ఉంటుంది. ముందస్తుగా రిటైర్మెంట్ కోసం చూస్తున్న వారికి లేదా పదవీ విరమణ తర్వాత ఆదాయాన్ని పొందాలనుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.

Read Also : WWDC 2025 : ఆపిల్ కొత్త iOS 26 అప్‌డేట్ ఆగయా.. ఫీచర్లు అదుర్స్.. ఐఫోన్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సపోర్టు చేసే మోడల్స్ ఇవే..!

అవసరమైన డాక్యుమెంట్లు :

  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డు
  • వయస్సు ధృవీకరణ పత్రం
  • అడ్రస్ సర్టిఫికెట్
  • బ్యాంక్ వివరాలు
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో