LIC Special Scheme
LIC Special Scheme : మహిళలకు గుడ్ న్యూస్.. LICలో మహిళల కోసం అద్భుతమైన స్కీమ్ ఉంది. ఈ LIC పథకంలో మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పైసా పెట్టుబడి లేకుండా నెలవారీ ఆదాయం పొందవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
ఈ పథకం పేరు LIC బీమా సఖి యోజన. ఈ పథకం కింద మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి LIC ఏజెంట్లుగా నియమిస్తారు. ఎల్ఐసీ బీమాకు సంబంధించి అవగాహనను పెంచడమే వీరి పని. తద్వారా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.
ఈ పథకం ఏంటి? ఎలా పొందాలి? అనేది పూర్తి వివరంగా తెలుసుకుందాం.. LIC బీమా సఖి యోజన కింద ఎంపికైన మహిళలకు మొదటి 3 ఏళ్లు నెలవారీ స్టైఫండ్ అందుతుంది. ఈ మొత్తం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ. 7వేలు స్థిర మొత్తంలో స్టైఫండ్ అందుతుంది. బీమా సఖిలు ఏజెంట్లుగా మారడానికి LIC వారికి స్పెషల్ ట్రైనింగ్, మార్కెటింగ్ ఎక్విప్‌మెంట్, క్యాంపెయిన్ సపోర్టును అందిస్తుంది.
ఎవరు అప్లయ్ చేసుకోలేరు :
ఇప్పటికే LIC ఏజెంట్లుగా ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరు. అలాగే, LIC ఉద్యోగులకు సంబంధించిన భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు దరఖాస్తు చేసేందుకు అనుమతి లేదు. పదవీ విరమణ చేసిన LIC ఉద్యోగులు, గతంలో LIC ఏజెంట్లుగా ఉన్నవారు కూడా ఈ పథకం ప్రయోజనం పొందలేరు.
ఎవరు దరఖాస్తు చేయొచ్చు? :
LIC బీమా సఖి యోజనకు దరఖాస్తు చేసేందుకు మీకు ఈ కింది డాక్యుమెంట్లు అవసరం.
ఎంపిక చేసిన మహిళా ఏజెంట్లకు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 7వేలు స్టైఫండ్ లభిస్తుంది. రెండో సంవత్సరంలో మొదటి సంవత్సరంలో విక్రయించిన పాలసీలలో కనీసం 65శాతం ప్రతి నెలా యాక్టివ్‌గా ఉంటే వారికి నెలకు రూ. 6వేలు లభిస్తుంది. తక్కువ పాలసీలు యాక్టివ్‌గా ఉంటే స్టైఫండ్ పొందలేరు.