కిక్కు దిగింది : తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు

  • Publish Date - December 16, 2019 / 02:19 PM IST

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వచ్చే వేళ షాక్ ఇచ్చింది.  రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బాటిల్ సామర్ధ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచినట్లు అబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు.  అన్నిరకాల మద్యం ధరలు 10 శాతం పెరిగాయి.  పెరిగిన ధరల వివరాలను సోమేశ్ కుమార్ విడుదల చేశారు. 

పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.  పెరిగిన ధరల  ప్రకారం  క్వార్టర్ బాటిల్ పై రూ.20, హాఫ్ బాటిల్ పై రూ.40, పుల్ బాటిల్ పై కనీసం రూ. 80 పెరిగాయి.  బీర్ ధరలు రూ.10-20 వరకు పెరిగాయి. పెరిగిన మద్యం ధరలవల్ల  ప్రభుత్వానికి రూ. 300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.