Car Price: చౌకగా కారు కొనాలంటే ఈరోజే.. రేపటి నుంచి భారీగా పెరగనున్న ధరలు

ఈ ఏడాదికి ఇదే చివరి రోజు.. 2021కి గుడ్‌బై చెప్పేసే రోజు.. అయితే, ఈరోజు వ్యాపారపరంగా కూడా.. అందులోనూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముఖ్యమైన రోజు.

Mercedes and Audi have announced price hikes

Car Price Hike: ఈ ఏడాదికి ఇదే చివరి రోజు.. 2021కి గుడ్‌బై చెప్పేసే రోజు.. అయితే, ఈరోజు వ్యాపారపరంగా కూడా.. అందులోనూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముఖ్యమైన రోజు.. చౌకగా కార్లను కొనుగోలు చేయడానికి ఇదే చివరి రోజు. ఎందుకంటే, రేపటి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ కానుండగా.. మోడల్ కూడా మారనుంది.

న్యూ ఇయర్-2022 నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి కంపెనీలు. మారుతీ, ఆడి, మెర్సిడెస్ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించాయి. టాటా కూడా కమర్షియల్ వాహనం ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోండా, రెనాల్ట్ కూడా ఇదే విషయాన్ని పరిశీలిస్తున్నాయి.

రెండు శాతం పెరగనున్న మెర్సిడెస్-బెంజ్ కార్లు:
మెర్సిడెస్ బెంజ్ తన కార్లపై ధరలను భారీగా పెంచబోతుంది. కంపెనీ తన వాహనాల ధరలను 2శాతం వరకు పెంచనుంది. ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా ధరను సరిచెయ్యాలని, జనవరి 1, 2021 నుంచి ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరను 2 శాతం పెంచనున్నట్లు Mercedes-Benz ఇండియా చెప్పింది.

ఆడి కార్లు:
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన అన్ని వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు, నిర్వహణ వ్యయాలను సరిచేసేందుకు ధరలను సవరిస్తున్నట్లు ఆడి ఇండియా స్పష్టంచేసింది. కంపెనీ తన అన్ని మోడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచనుంది.

మారుతీ సుజుకీ కార్లు:
మారుతీ సుజుకీ తన కార్ల ధరలను జనవరి నుంచి పెంచబోతోంది. మారుతీ సుజుకీ ఇండియా కూడా ముడి సరుకుల ధరల పెరుగుదల కారణంగా కంపెనీ వాహనాలపై ధరల పెంచాలని నిర్ణయించింది.

టాటా కమర్షియల్ వాహనాలు:
దేశీయ వాహన కంపెనీ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను జనవరి 1 నుండి 2.5 శాతం పెంచబోతోంది. కమోడిటీల ధరలు పెరగడం, ముడిసరుకు ధరలు పెరగడం వల్లే ఈ చర్యకు పూనుకున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఇక హోండా, రెనాల్ట్ కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అందుకు సంబంధించిన ప్రకటనను మాత్రం ఇప్పటివరకు ఆయా కంపెనీలు చెయ్యలేదు.