LPG Gas Connection: కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక కష్టమే

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో తలెత్తిన వివాదాలు భారత గ్యాస్(LPG Gas Connection) సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Lpg cylinder new connection ban middle east crisis gas supply disruption

  • కొత్త గ్యాస్ కనెక్షన్ల నిలిపివేత
  • అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా అంతరాయం
  • చిన్న కాంపోజిట్ సిలిండర్ల వాడకం

LPG Gas Connection: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో తలెత్తిన వివాదాలు భారత గ్యాస్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయంగా గ్యాస్ రవాణాలో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో 14.2 కిలోల కొత్త ఎల్పీజీ కనెక్షన్ల జారీపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. మార్చి 2026 నుంచి కొత్త కనెక్షన్లు నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Sugar Shortage: పండగల వేళ చక్కెర కొరత.. కొనుగోళ్లపై పరిమితులు.. ఒక్కొక్కరికి ఎన్ని కేజీలో తెలుసా?

ప్రస్తుత వినియోగదారులకే ప్రాధాన్యం – దిగుమతుల సవాళ్లు:

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇప్పటికే కనెక్షన్ ఉన్న పాత వినియోగదారులకు నిరంతరాయంగా రీఫిల్ సిలిండర్లు(LPG Gas Connection) అందించడానికే కేంద్రం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో భారత్ తన ఎల్పీజీ దిగుమతుల్లో 90 శాతం హోర్ముజ్ జలసంధి నుంచే పొందేది. కానీ అక్కడి సరఫరా తగ్గడంతో ప్రస్తుతం రవాణా వ్యయం ఎక్కువైనా సరే 67 శాతం ఎల్పీజీని సుదూర అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితులు సర్దుమణిగాకే కొత్త కనెక్షన్లు ఇస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల ప్రత్యామ్నాయ సూచనలు:

కొత్త 14.2 కేజీల కనెక్షన్లు రాని వినియోగదారులకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. తాత్కాలికంగా తమ అవసరాల కోసం 5 కిలోలు లేదా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్న 10 కిలోల ‘ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ’ సిలిండర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా బుక్ చేసుకుని వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.