LPG price hike 19 kg gas cylinder rate increased by Rs 48
ఓ వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇక ప్రతి నెలా చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పండుగ సీజన్ అయిన అక్టోబర్‌లో గ్యాస్ బండ మోత తప్పదేమోనని భావించగా చమురు కంపెనీలు కాస్త ఊరట నిచ్చాయి. ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.
అయితే.. కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచడం గమనార్హం. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.48.50 పెరిగింది. పెరిగిన ధరలు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి.
భారత స్టాక్ మార్కెట్‌ను డామినేట్ చేస్తున్న యంగ్‌స్టర్స్..
ధరల పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1691 నుంచి 1740కి పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.1644 నుంచి 1692.50కి, కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి చేరింది. ఇక చెన్నై నగరంలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967గా ఉంది.
డొమెస్టిక్ సిలిండర్ ధరలు ఇలా..
ఇక మార్చి నెల నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డొమెస్టిక్ ధర రూ.855 గా ఉంది. అదే విధంగా చెన్నైలో రూ.818.50, ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో 802.50గా ఉంది.