MacBook Air M1 : మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 58,990కే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

MacBook Air M1 : ఆపిల్ మ్యాక్ ల్యాప్‌టాప్ కావాలా? రూ. 90వేల విలువైన మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ. 58,990లకే లభిస్తోంది.

MacBook Air M1

MacBook Air M1 : కొత్త ల్యాప్ టాప్ కొంటున్నారా? అయితే, మీకోసం ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. బడ్జెట్ పరంగా అత్యంత ఖరీదైన మ్యాక్‌బుక్ (MacBook Air M1 ) కొనడం కొందరికి కష్టమే. ప్రీమియం పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ అందించే ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్‌లో తగ్గింపు ధరకే పొందవచ్చు. గతంలో కన్నా సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

సాధారణ విండోస్ ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే.. కొనుగోలుదారులకు మ్యాక్‌బుక్స్ అందుబాటులో ఉండవు. కానీ, మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై అమెజాన్ లేటెస్ట్ డిస్కౌంట్ అందరికీ తెస్తుంది. మీరు విద్యార్థి అయినా లేదా ప్రొఫెషనల్ అయినా ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

మ్యాక్‌బుక్ ఎయిర్ M1 కేవలం రూ.58,990కే లభిస్తుంది. మ్యాక్‌బుక్ ఎయిర్ M1 (8GB ర్యామ్, 256GB SSD) ప్రస్తుతం అమెజాన్‌లో రూ.89,900 ధరకు లిస్టు అయింది. అయితే, 34 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ.58,990కి చేరుకుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ M1పై డిస్కౌంట్లు :

  • బ్యాంక్ కార్డులపై రూ. 1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • రూ. 2,949 క్యాష్‌బ్యాక్ ఆఫర్
  • 24 నెలలకు నెలకు రూ. 2,888 నుంచి EMI ఆప్షన్.
  • పాత ల్యాప్‌టాప్‌ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 6,750 వరకు తగ్గింపు
  • టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
  • ఆపిల్ గేమ్-ఛేంజింగ్ M1 చిప్

డిస్‌ప్లే : 13.3-అంగుళాల రెటినా డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లు

పర్ఫార్మెన్స్ : మల్టీ టాస్కింగ్ కోసం 8-కోర్ CPUతో ఆపిల్ M1 చిప్

మెమరీ :
16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ వరకు (8GB/256GB)

గ్రాఫిక్స్ :
లైట్ గేమింగ్, ఎడిటింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ GPU

బ్యాటరీ లైఫ్ :
సింగిల్ ఛార్జ్ చేస్తే 18 గంటల వరకు

ఇతర ఫీచర్లు :
బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫేస్‌టైమ్ HD కెమెరా, మాకోస్ ఎక్స్‌పీరియన్స్

Read Also : Apple WWDC 2025 : ఆపిల్ బిగ్ ఈవెంట్.. కీనోట్ ఎప్పుడు? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? ఏయే కొత్త అప్‌డేట్స్ ఉండొచ్చంటే?

విద్యార్థులు, క్రియేటర్లు, ప్రొఫెషనర్లకు బెస్ట్ ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు. మీరు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నా, వీడియోలను ఎడిట్ చేస్తున్నా లేదా రిమోట్‌గా పనిచేస్తున్నా మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు.

లిమిటెడ్ స్టాక్ మాత్రమే :
ఈ భారీ ధర తగ్గింపు, లిమిటెడ్ టైమ్ ఆఫర్లతో మ్యాక్‌బుక్ ఎయిర్ M1కి డిమాండ్ ఎక్కువగా ఉంది.