Mahindra May Discounts : మహీంద్రా మే మెగా డిస్కౌంట్లు.. కొత్త కారు కొనేవాళ్లకు డబుల్ ధమాకా! రూ. 2.5 లక్షల వరకు సేవింగ్
Mahindra Discounts : మహీంద్రా కంపెనీ మే 2026లో ఐసిఇ (ICE) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్ సహా పలు మోడళ్లపై రూ. 2.5 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తోంది. ఏ మోడల్ ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- May 13, 2026 / 04:09 PM IST
Mahindra Discounts ( Illustration generated using AI )
- రూ.2.5 లక్షల వరకు సేవింగ్.. మహీంద్రా మే ఆఫర్లతో మార్కెట్ షేక్
- థార్ రాక్స్ నుంచి XUV వరకు.. మహీంద్రా మే సేల్ డిస్కౌంట్లు
- మహీంద్రా కార్లపై ఊహించని ఆఫర్లు.. BE6, స్కార్పియో, థార్‌పై భారీ కోత..
Mahindra Discounts : కొత్త కారు కొనేవారికి భారీ గుడ్ న్యూస్.. మహీంద్రా కారు లవర్స్ అయితే ఈ అద్భుతమైన ఆఫర్లు మీకోసమే.. మహీంద్రా ఇండియా SUV మోడల్స్ మార్కెట్లో బాగా పాపులర్.. అయితే, ఈ మోడళ్లకు ఫుల్ డిమాండ్ పెరగడంతో బ్రాండ్ అమ్మకాలు జోరందుకున్నాయి.
ఇప్పుడు సేల్స్ మరిన్ని పెంచుకునేందుకు ఈ ఆటోమొబైల్ కంపెనీ మే 2026లో ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. డీలర్‌షిప్-లెవల్ కేటగిరీల నుంచి లోకల్, డీలర్ బట్టి సిటీ, అవుట్‌లెట్‌లలో ఆఫర్లు మారవచ్చు. ఇందులో మహీంద్రా బీఈ6, థార్ రాక్స్, స్కార్పియో వంటి మోడళ్లపై ఎక్కువ మొత్తంలో సేవింగ్ చేసుకోవచ్చు.
మహీంద్రా XUV400 ఈవీ తగ్గింపు :
మహీంద్రా ఈ నెలలో XUV400 ఈవీపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈసీ ప్రో ఈఎల్ ప్రో వేరియంట్లపై కొనుగోలుదారులు రూ. 2.5 లక్షల వరకు క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు. బీఈ 6 ఎక్స్ఈవీ 9ఇ వంటి మహీంద్రా కొత్త INGLO-ఆధారిత ఈవీల నుంచి ఈ ఎలక్ట్రిక్ SUV భారీ పోటీని ఎదుర్కొంటోంది.
తద్వారా అమ్మకాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది. కంపెనీ బీఈ 6 ఎక్స్ఈవీ 9ఇ (MY2025) ఇన్వెంటరీని కూడా వరుసగా రూ. 2 లక్షలు నుంచి రూ. 1.4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ఆఫర్లు లిమిటెడ్ స్టాక్‌పై మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మహీంద్రా థార్ రాక్స్ తగ్గింపు :
ఈ నెలలో అత్యంత ఆకర్షణీయమైన కాంబైన్డ్ ఆఫర్లలో మహీంద్రా థార్ రాక్స్ ఒకటి. వినియోగదారులు రూ. 85వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల విలువైన యాక్సెసరీలతో సహా రూ. 1.10 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ మార్కెట్‌లో భారీ డిమాండ్ పలుకుతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO స్కార్పియో తగ్గింపు :
మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO కాంపాక్ట్ SUV మొత్తం రూ. 60వేల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ. 40వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేల విలువైన యాక్సెసరీలు ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో రేంజ్ కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది. స్కార్పియో క్లాసిక్‌పై రూ. 50వేల వరకు బెనిఫిట్స్ లభిస్తుండగా, స్కార్పియో ఎన్ జెడ్4 జెడ్8 వేరియంట్లపై వరుసగా రూ. 30వేలు, రూ. 20వేల తగ్గింపులు పొందవచ్చు.
మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ తగ్గింపు :
మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ కారు ( MY2025) మోడళ్లపై మే 2026లో రూ. 1.4 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్లను అందిస్తుంది.
మహీంద్రా బొలెరో నియో :
బొలెరో నియో ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు రూ. 25వేలు క్యాష్ బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే, స్టాండర్డ్ బొలెరో, XUV 7XO మూడు-డోర్ల థార్‌పై ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు లేవు.
