Mahindra Scorpio : 9 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటేసిన మహీంద్రా స్కార్పియో..!

Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియో ప్రస్తుతం స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే రెండు అవతార్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంది.

Mahindra Scorpio reaches production milestone of 900,000 units

Mahindra Scorpio : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) తమ ఉత్పత్తిలో 9లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుందని మహీంద్రా & మహీంద్రా ప్రకటించింది. పాపులర్ స్పోర్ట్ యుటిలిటీ వాహనం (SUV) భారత మార్కెట్లో రెండు దశాబ్దాల క్రితమే 2002లో లాంచ్ అయింది.

ప్రస్తుతం, స్కార్పియో స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ అనే రెండు అవతార్‌లలో విక్రయిస్తోంది. స్కార్పియో-N ధర రూ. 13.05 లక్షల నుంచి రూ. 24.51 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, స్కార్పియో క్లాసిక్ రూ. 13 లక్షల నుంచి రూ. 16.81 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అందుబాటులో ఉంది. జూన్ 2022లో లాంచ్ అయిన Scorpio-N 30 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో లక్ష బుకింగ్‌లను సాధించింది.

Read Also : Upcoming Smartphones in July : కొత్త ఫోన్ కొంటున్నారా? జూలైలో రాబోయే సరికొత్త 5G ఫోన్లు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!

మహీంద్రా స్కార్పియో-N 2.0-లీటర్ mStallion TGDi పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ mHawk CRDi డీజిల్ ఇంజన్‌ను అందిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ MTతో 203PS, 370Nm, 6-స్పీడ్ ATతో 203PS, 380Nmలను అభివృద్ధి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ MTతో 175PS, 370Nm, 6-స్పీడ్ ATతో 175PS, 400Nm టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ యూనిట్ తక్కువ శక్తివంతమైన అవతార్ కూడా ఉంది. ఇందులో 132PS, 300Nm చేస్తుంది. Scorpio-N డీజిల్‌లో 4WD ఆప్షన్ కూడా ఉంది.

Mahindra Scorpio reaches production milestone of 900,000 units

మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో 2.2-లీటర్ mHawk CRDi డీజిల్ ఇంజన్ 132PS, 300Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ MTతో వస్తుంది. ఆఫర్‌లో 4WD లేదు. ‘మా ఉత్పత్తి సౌకర్యాల నుంచి 9లక్షలకు పైగా స్కార్పియోల మైలురాయిని చేరుకోవడం మహీంద్రాకు ఎంతో గర్వకారణం. SUV సెగ్మెంట్‌లో స్కార్పియోను ఎదురులేని ఐకాన్‌గా మార్చిన మా కస్టమర్‌ల అచంచలమైన మద్దతు, విధేయతకు చాలా కృతజ్ఞతలు’ అని మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజయ్ నక్రా అన్నారు.

ఇటీవలి స్కార్పియో-ఎన్ స్కార్పియో క్లాసిక్ లాంచ్‌తో ఈ పవర్ బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఈ మైలురాయి సంవత్సరాలుగా తమ కస్టమర్‌లతో ఏర్పరచుకున్న బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ కాకుండా, మహీంద్రా XUV700, థార్, XUV300, బొలెరో నియో, బొలెరో వంటి SUVలను విక్రయిస్తుంది.

Read Also : Zomato Food Order : జొమాటోలో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఒకేసారి అనేక రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు..!