×
Ad

Mahindra SUV Discount : కొత్త కారు కొనేసుకోండి.. మహీంద్రా SUVలపై రూ.3.25 లక్షల డిస్కౌంట్లు.. స్కార్పియో, థార్ రాక్స్ XUV700 బిగ్ డీల్స్..!

Mahindra SUV Discount : మహీంద్రా ఈ నవంబర్‌లో SUV లైనప్‌పై ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.40వేల నుంచి రూ.3.25 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ అందిస్తోంది. పూర్తి వివరాలివే..

Mahindra SUV Discount

Mahindra SUV Discount : మహీంద్రా లవర్స్‌కు అద్భుతమైన డిస్కౌంట్లు.. మహీంద్రా నవంబర్ 2025 SUV రేంజ్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రటకించింది. స్కార్పియో, థార్ రాక్స్ నుంచి XUV700 బొలెరో వరకు, కార్ల తయారీదారు రూ. 3.25 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఇతర బెనిఫిట్స్ అందిస్తోంది.

బొలెరోతో మొదలైన కార్ల ధరలు (Mahindra SUV Discount) మహీంద్రా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ B6 (O) వేరియంట్‌పై రూ. 1.3 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 1.1 క్యాష్ డిస్కౌంట్, రూ. 20వేల విలువైన యాక్ససరీస్ ఉన్నాయి. బొలెరో నియో కూడా రూ. 1.35 లక్షల విలువైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో రూ. 1.05 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ. 30వేల యాక్ససరీస్ ఉన్నాయి.

స్కార్పియో ఫ్యాన్స్ కోసం మహీంద్రా క్లాసిక్ కొత్త స్కార్పియో N రెండింటిపై భారీ సేవింగ్స్‌తో అందిస్తోంది. స్కార్పియో క్లాసిక్ రూ.25వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25వేల విలువైన యాక్ససరీస్ సహా మొత్తం రూ.50వేలు బెనిఫిట్స్ అందిస్తుంది.

Read Also : OnePlus 15R Launch : వారెవ్వా.. పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త వన్‌ప్లస్ 15R ఫోన్ వచ్చేస్తోందోచ్.. ధర, డిజైన్ కీలక వివరాలు లీక్..

మహీంద్రా కార్లపై క్యాష్ డిస్కౌంట్లు ఇవే :

అదే సమయంలో, స్కార్పియో NZ8 వేరియంట్ రూ.20వేల క్యాష్ డిస్కౌంట్, రూ.20వేల యాక్ససరీస్ మొత్తం రూ.40వేలు అందిస్తుంది. ఆఫ్-రోడ్ పరంగా పరిశీలిస్తే థార్ రాక్స్ కొనుగోలుపై కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు Ax7L వేరియంట్‌పై రూ. 50వేల బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 35వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15వేల ఇతర యాక్ససరీస్ లభిస్తాయి.

కాంపాక్ట్ SUV లైనప్‌ను కూడా వదిలిపెట్టలేదు. మహీంద్రా XUV3XO వేరియంట్‌ను బట్టి రూ. 50వేల నుంచి రూ. 55వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. MPFI వెర్షన్ రూ. 30వేల క్యాష్ డిస్కౌంట్ రూ. 20వేల యాక్ససరీస్‌తో వస్తుంది. అయితే, టాప్-ఎండ్ TGDI Ax7L మోడల్ రూ. 35వేల క్యాష్, రూ. 20వేల యాక్ససరీస్ అందిస్తుంది. మహీంద్రా XUV400 EL ప్రోపై అతిపెద్ద డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. 3.25 లక్షల క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది.

ప్రస్తుతం ఈ కేటగిరీలో అత్యంత డిస్కౌంట్లలో ఇదొకటి. మహీంద్రా XUV700 కూడా భారీ తగ్గింపు పొందనుంది. Ax3, Ax5 వేరియంట్లపై మొత్తం రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. కస్టమర్లకు రూ. 75వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 25వేల విలువైన యాక్ససరీస్ లభిస్తాయి. డీలర్ స్టాక్ లొకేషన్ బట్టి ఈ ఆఫర్లు నవంబర్ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి.