Maruti Cars Price Hike : కొత్త కారు కొంటున్నారా? పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు.. ఎంతో తెలుసా?

Maruti Cars Price Hike : అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇండియా (Maruti Suzuki India) కార్ల ధరలను అమాంతం పెంచేసింది. మొత్తం ద్రవ్యోల్బణంతో పాటు నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడితోనే ఈ ధరలను పెంచినట్టు తెలుస్తోంది.

Maruti Cars Price Hike : కొత్త కారు కొంటున్నారా? పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు.. ఎంతో తెలుసా?

Maruti Cars Price Hike Photo : (Google)

Updated On : April 3, 2023 / 3:46 PM IST

Maruti Cars Price Hike : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? కార్ల ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్టు ఇప్పటికే కార్ల తయారీ కంపెనీలు ప్రకటించాయి. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో కార్ల ధరల పెంపునకు సంబంధించి కంపెనీలు వివరాలను వెల్లడించాయి.

మిగతా కంపెనీలు మాదిరిగానే ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ కార్ల ధర (Car Price Hike)లను అమాంతం పెంచేసింది. ఆర్థిక సంవత్సరం FY24లో మారుతి మొదటి ధరల పెంపు (Maruti First Price)ను ప్రకటించింది. తన వాహనాల ధరలను సగటున 0.8శాతం పెంచినట్టు వెల్లడించింది. మారుతి కార్ల మోడళ్లలో అంచనా వేసిన సగటు పెరుగుదల దాదాపు 0.8శాతంగా నమోదైంది.

Read Also :  Maruti Car Prices : కొత్త కారు కొంటున్నారా? ఏప్రిల్ నుంచి భారీగా పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి!

దేశ రాజధాని ఢిల్లీలో మోడల్స్ ఎక్స్-షోరూమ్ ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతున్నట్టు మారుతి ఏప్రిల్ 1న ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త ధరల పెంపు మొత్తం ద్రవ్యోల్బణంతో పాటు నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడి కారణంగా అని తెలుస్తోంది. అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరొందిన మారుతి తమ కార్ల ధరలను FY23లో రెండుసార్లు, ఏప్రిల్‌లో ఒకసారి 1.3శాతం, ఆపై జనవరిలో 1.1శాతం పెంచింది. మారుతి తన కార్లను అరేనా (Arena), నెక్సా (Nexa) రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయిస్తుంది.

Maruti Cars Price Hike _ Maruti Suzuki India takes first price hike in FY24, check out the increase here

Maruti Cars Price Hike Photo : (Google)

మారుతి కార్లలో పాపులర్ మోడల్ అరేనా (Arena) మోడళ్లలో Alto K10, Eeco, WagonR, Swift, Dzire, Ertiga, Brezza కార్లు ఉన్నాయి. Nexa మోడల్స్‌లో ఇగ్నిస్, బాలెనో, సియాజ్, XL6 గ్రాండ్ విటారా ఉన్నాయి. రాబోయే Fronx, Jimny Nexa డీలర్‌షిప్‌ల నుంచి కూడా విక్రయించనుంది.

మారుతి కంపెనీ FY23ని ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక మొత్తం వాల్యూమ్‌లతో 1,966,164 యూనిట్లతో ముగించింది, FY19లో సాధించిన 1,862,449 యూనిట్లతో గతంలో కన్నా అత్యుత్తమ స్థాయిని అధిగమించింది. FY23లో 259,333 యూనిట్ల షిప్‌మెంట్‌లతో మారుతి అత్యుత్తమ ఎగుమతులను నమోదు చేసింది.

Read Also : Maruti Suzuki SUV Cars : మారుతి సుజుకి నుంచి రెండు కొత్త మోడల్ SUV కార్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?