Maruti Suzuki Car Prices
Maruti Suzuki Car Prices : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మారుతి కార్ల ధరలు భారీగా తగ్గాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అన్ని కార్ల కొత్త ధరలను ప్రకటించింది. కొత్త జీఎస్టీ తగ్గింపు తర్వాత కంపెనీ మొత్తం లైనప్‌లో కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. కంపెనీ ఈ సమాచారాన్ని ఫైల్ ఎక్స్ఛేంజ్‌లో అందించింది.
కొత్త సవరించిన కార్ల ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచి వర్తిస్తాయి. జీఎస్టీ నియమాలకు అనుగుణంగా ఉంటాయి. అయితే, పండగ సీజన్ కావడంతో ఈ సమయంలో కార్ల అమ్మకాలు జోరుందుకోనున్నాయి. కొత్త ధరలతో, S-ప్రెస్సో ఇప్పుడు మారుతి పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన కారుగా లభ్యం కానుంది. కంపెనీ ఈ కారు ధరను రూ.1.29 లక్షల వరకు తగ్గించింది. కంపెనీ కార్ల కొత్త ధరల జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
ఫోర్ వీలర్ కార్లపై 18శాతం జీఎస్టీ :
సెప్టెంబర్ 4, 2025న కేంద్ర ప్రభుత్వం సబ్బుల నుంచి చిన్న కార్ల వరకు వందలాది వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. చిన్న కార్లు 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే పెట్రోల్ ఇంజన్లు 1,200CC కన్నా తక్కువ, డీజిల్ ఇంజన్లు 1,500CC కన్నా తక్కువ. ఇలాంటి 4 వీలర్ వాహనాలపై 18శాతం పన్ను విధిస్తారు. పెద్ద కార్లు లేదా లగ్జరీ కార్లు 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు కలిగి ఉంటాయి.
పెట్రోల్ ఇంజన్లు 1,200CC కన్నా పెద్దవి. డీజిల్ ఇంజన్లు 1,500CC కన్నా పెద్దవి. ఇలాంటి 4 వీల్స్ వాహనాలపై 40శాతం పన్ను విధిస్తారు. అలాగే హైబ్రిడ్ కార్లకు కూడా ఇది వర్తిస్తుంది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఎలక్ట్రిక్ కార్లు కూడా అత్యల్ప 5శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది.
మారుతి సుజుకి కార్ల కొత్త ధరలివే..:
మారుతి సుజుకి కార్ల కొత్త ధరల విషయానికి వస్తే.. మారుతి S-ప్రెస్సో ధర రూ.1,29,600 తగ్గింది. ఆ తర్వాత కొత్త ప్రారంభ ధర రూ.3,49,900కు లభ్యమవుతుంది. ఆల్టో K10 ధర రూ.1,07,600 తగ్గింది. ఆపై ఈ కారు కొత్త ధర రూ.3,69,900 అయింది. సెలెరియో అసలు ధర రూ.4,98,900 ఉండగా రూ.94,100 తగ్గింపుతో కొత్త ప్రారంభ ధర రూ.4,69,900కు చేరింది.
మారుతి ఇగ్నిస్ ధర రూ. 71,300 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 5,35,100కి చేరుకుంది. స్విఫ్ట్ ధర రూ. 84,600 తగ్గడంతో కొత్త ప్రారంభ ధర రూ. 5,78,900కి చేరుకుంది. మారుతి బాలెనో ధర రూ. 86,100 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 5,98,900కి చేరుకుంది. మారుతి టూర్ S ధర రూ. 67,200 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 6,23,800కి చేరుకుంది. మారుతి డిజైర్ ధర రూ. 87,700 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 6,25,600కి చేరుకుంది.
మారుతి ఫ్రాంక్స్ ధర రూ. 1,12,600 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 6,84,900కి చేరుకుంది. బ్రెజ్జా ధర రూ. 1,12,700 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 8,25,900కి చేరుకుంది. మారుతి గ్రాండ్ విటారా ధర రూ. 1,07,000 తగ్గింది. కొత్త ప్రారంభ ధర రూ. 10,76,500కి చేరుకుంది. మారుతి జిమ్నీ ధర రూ. 51,900 తగ్గగా కొత్త ప్రారంభ ధర రూ. 12,31,500కి చేరుకుంది. మారుతి ఎర్టిగా ధర రూ. 46,400 తగ్గడంతో కొత్త ప్రారంభ ధర రూ. 8,80,000కి చేరుకుంది.
మారుతి XL6 ధర రూ. 52వేలు తగ్గడంతో కొత్త ప్రారంభ ధర రూ. 11,52,300కి చేరుకుంది. మారుతి ఇన్విక్టో ధర రూ. 61,700 తగ్గింపుతో కొత్త ప్రారంభ ధర రూ. 24,97,400కి చేరుకుంది. మారుతి ఈకో ధర రూ. 68వేలు తగ్గింపుతో కొత్త ప్రారంభ ధర రూ. 5,18,100కి చేరుకుంది. సూపర్ క్యారీ ధర రూ. 52,100 తగ్గింపుతో కొత్త ప్రారంభ ధర రూ. 5,06,100కి చేరుకుంది.
మారుతి సుజుకి కొత్త మోడల్ వారీగా ధరలు | ||
మోడల్ | ఎక్స్-షోరూమ్ ధర తగ్గింపు (రూ.) | కొత్త ప్రారంభ ధర (రూ.) |
S-ప్రెస్సో | రూ. 1,29,600 వరకు | 3,49,900 |
ఆల్టో K10 | రూ. 1,07,600 వరకు | 3,69,900 |
సెలెరియో | రూ. 94,100 వరకు | 4,69,900 |
వ్యాగన్-R | రూ. 79,600 వరకు | 4,98,900 |
ఇగ్నిస్ | రూ. 71,300 వరకు | 5,35,100 |
స్విఫ్ట్ | రూ. 84,600 వరకు | 5,78,900 |
బాలెనో | రూ. 86,100 వరకు | 5,98,900 |
టూర్ S | రూ. 67,200 వరకు | 6,23,800 |
డిజైర్ | రూ. 87,700 వరకు | 6,25,600 |
ఫ్రాంక్స్ | రూ. 1,12,600 వరకు | 6,84,900 |
బ్రెజ్జా | రూ. 1,12,700 వరకు | 8,25,900 |
గ్రాండ్ విటారా | రూ. 1,07,000 వరకు | 10,76,500 |
జిమ్నీ | రూ. 51,900 వరకు | 12,31,500 |
ఎర్టిగా | రూ. 46,400 వరకు | 8,80,000 |
XL 6 | రూ. 52,000 వరకు | 11,52,300 |
ఇన్విక్టో | రూ. 61,700 వరకు | 24,97,400 |
ఈకో | రూ. 68,000 వరకు | 5,18,100 |
సూపర్ క్యారీ | రూ. 52,100 వరకు | 5,06,100 |