×
Ad

Maruti Suzuki Discounts : మారుతి డిసెంబర్ ధమాకా ఆఫర్లు.. ఈ మోడల్ కార్లపై రూ. 2లక్షలకు పైగా డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో కొనేసుకోండి!

Maruti Suzuki Discounts : మారుతి సుజుకి అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొనుగోలుదారులకు ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనోతో సహా ఎంపిక చేసిన కార్లపై రూ. 2 లక్షలకు పైగా డిస్కౌంట్లు పొందవచ్చు.

Maruti Suzuki Discounts

Maruti Suzuki Discounts : 2025 ఏడాది ముగుస్తోంది. మారుతి సుజుకి అనేక పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం MPV వరకు కొనుగోలుదారులు భారీగా సేవింగ్స్ పొందవచ్చు. కారును బుక్ చేసుకునేందుకు ఇదే బెస్ట్ టైమ్. కొన్ని మోడళ్లకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, డీలర్-లెవల్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనోతో సహా (Maruti Suzuki Discounts) ఎంపిక చేసిన కార్లపై మొత్తం బెనిఫిట్స్ రూ. 2 లక్షలకు మించి పొందవచ్చు. మీకు ఇష్టమైన మారుతి సుజుకి మోడళ్లపై డిస్కౌంట్ ఎంత అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఏ మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్? :
మారుతి సుజుకి ఇన్విక్టో : ఈ నెలలో ఈ MPV భారీ బెనిఫిట్స్ అందిస్తోంది. మొత్తం సేవింగ్ రూ. 2.15 లక్షల వరకు ఉంటుంది.
ఇందులో రూ. 1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ. 1.15 లక్షలు ఉంటాయి.
మారుతి సుజుకి జిమ్నీ ఆఫ్-రోడ్-ఫ్రెండ్లీ కాంపాక్ట్ SUV ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ. 1 లక్ష వరకు నేరుగా క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ : వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్లు రూ. 78వేల నుంచి రూ. 88వేల వరకు ఉంటాయి. ఇందులో కొన్ని టర్బో ట్రిమ్‌లపై యాక్సెసరీ ఆఫర్‌లు ఉన్నాయి.
మారుతి సుజుకి బాలెనో : ఈ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.60వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ నెలలో తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
సియాజ్ సెడాన్ ఇతర మోడళ్లు XL6 వంటి MPV కార్లు కూడా చిన్న డిస్కౌంట్ స్లాబ్‌ పరిధిలోకి వస్తాయి. అయితే, అన్నీ రూ. 2 లక్షల పరిమితిని చేరుకోలేదు.

కార్లపై భారీ డిస్కౌంట్లు ఎందుకంటే? :

ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు లేదా రాబోయే కొత్త కార్ల లాంచ్‌కు ముందు ఆటోమేకర్లు పాత ఇన్వెంటరీని క్లియర్ చేస్తుంటారు. మారుతి సుజుకి కార్లపై ఈ భారీ డిస్కౌంట్లను అందించడానికి కారణం కొత్త వేరియంట్లు మార్కెట్లో రిలీజ్ చేయడమే.. పాత స్టాక్ కార్లను కూడా తొందరగా క్లియర్ చేయడానికి కారణం కూడా ఇదే. అయితే, కొనుగోలుదారులు తక్కువ ధరకే కార్లను కొనేసుకోవచ్చు. సీజన్ డిమాండ్, పోటీ, ఇన్వెంటరీతో కలిపి డిస్కౌంట్ ధరకే మీకు నచ్చిన కారును కొనేసుకోవచ్చు.

బుకింగ్ చేసే ముందు ఏం చెక్ చేయాలి? :
కొత్త కారు కొనే ముందు మీరు ఎంచుకున్న వేరియంట్‌కు డిస్కౌంట్ వర్తిస్తుందో లేదో చెక్ చేయండి. ఎందుకంటే.. కొన్ని ట్రిమ్‌లు తక్కువ బెనిఫిట్స్ కలిగి ఉండొచ్చు. ఆ తర్వాత ఆన్-రోడ్ ఖర్చులలో (రిజిస్ట్రేషన్, పన్నులు, ఇన్సూరెన్స్) కూడా చెక్ చేయాలి.

ఎందుకంటే.. ఇవి డిస్కౌంట్‌ల పరిధిలోకి రావు. మీరు పాత కారు కొనాలని చూస్తున్నా లేదా స్క్రాపేజ్‌ను ఎంచుకుంటే అర్హతను జాగ్రత్తగా చెక్ చేయండి. అధిక డిమాండ్ ఉన్న వేరియంట్‌లు వేగంగా అమ్ముడవుతాయి. ముందస్తు బుకింగ్ ద్వారా సరైన ఆఫర్‌ను పొందవచ్చు.

డిసెంబర్ నెలలో కారు కొనొచ్చా? :
డిసెంబర్ నెలలో కొత్త కారు కొనొచ్చు. హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి SUV, MPV వరకు ఉన్న మోడళ్లపై భారీ తగ్గింపు ధరకే ఇంటికి తీసుకురావొచ్చు. ధర తగ్గింపుతో కొనుగోలుదారులు కొంచెం అదనంగా యాడ్-ఆన్‌లను పొందవచ్చు. డిసెంబర్ ఆఫర్లలో మీకు నచ్చిన మారుతి కారును ఎంచుకుని కొనేసుకోవచ్చు.