భారతదేశ ఆఫ్-రోడ్ SUV మార్కెట్‌లో రెండు కార్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఒకటి మహీంద్రా థార్, మరొకటి మారుతి సుజుకి జిమ్నీ. ఒకటి తన పవర్‌తో మార్కెట్‌ను ఏలుతుంటే, మరొకటి తన ప్రత్యేకమైన స్టైల్‌తో సవాల్ విసురుతోంది. అయితే, నిజమైన విజేత ఎవరు? అమ్మకాల యుద్ధంలో పైచేయి ఎవరిది? ఇండియాలో థార్ కింగ్ అయితే, విదేశాల్లో జిమ్నీకి ఎందుకంత క్రేజ్?
మారుతి సుజుకి జిమ్నీ మార్కెట్లో మరో మైలురాయిని సాధించింది. ఈ స్టైలిష్ SUV ఇప్పటికే లక్ష యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి దూసుకెళ్తోంది. 5-డోర్ వేరియంట్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన జిమ్నీ, ప్రత్యేకించి ఫ్యామిలీ యూజర్లను ఆకర్షిస్తోంది.
అయితే మార్కెట్లో ఇదే సగటు సెగ్మెంటులో నిలబడి ఉన్న మరో స్ట్రాంగ్ SUV మహీంద్రా థార్. వీటి మధ్య పోటీ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. మరి జిమ్నీ విజయ రన్ మహీంద్రా థార్‌పై ఎలా ప్రభావం చూపించిందో, ఫీచర్లు, ధరలు, మైలేజ్ వంటి కీలక అంశాల్లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పూర్తి విశ్లేషణ ఇక్కడ చూద్దాం…
అమ్మకాల పరంగా ఈ రెండు SUVల మధ్య భారీ వ్యత్యాసం ఉంది.
మహీంద్రా థార్: ది లోకల్ ఛాంపియన్
ఎప్పుడు లాంచ్ అయింది?: 2020 అక్టోబర్
మొత్తం అమ్మకాలు: 2,59,921 యూనిట్లు (2025 ఏప్రిల్ వరకు)
మార్కెట్లోకి ముందుగా రావడం, డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉండటం, దాని రగ్గడ్ లుక్ కారణంగా థార్ భారతీయ మార్కెట్‌లో స్పష్టమైన విజేతగా నిలిచింది.
Mahindra Thar
ఎప్పుడు లాంచ్ అయింది?: 2023 జూన్
మొత్తం అమ్మకాలు: 1,02,024 యూనిట్లు (2025 ఏప్రిల్ వరకు)
అసలు ట్విస్ట్ ఇక్కడే: ఈ అమ్మకాలలో, కేవలం 26,180 యూనిట్లు మాత్రమే ఇండియాలో అమ్ముడయ్యాయి. మిగిలిన 75,844 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. దీన్నిబట్టి, జిమ్నీకి విదేశీ మార్కెట్లలో ఎంత బలమైన డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫీచర్ల పోలిక: ఢీ అంటే ఢీ (Jimny vs Thar: Feature Comparison)
ధర, బిల్ట్ క్వాలిటీ: జిమ్నీ ప్రారంభ ధర రూ.12.75 లక్షలు కాగా, థార్ ప్రారంభ ధర రూ.11.50 లక్షలు. ధరలో చిన్న తేడా ఉన్నా, థార్‌లో డీజిల్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. రెండూ బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణంతో వస్తాయి, ఇది ఆఫ్-రోడింగ్‌కి మరింత మంచి స్పోర్ట్ లుక్‌ను ఇస్తుంది.
సౌకర్యాలు: జిమ్నీలో క్రూజ్ కంట్రోల్, టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. థార్‌లో హిల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నా, అంతర్గత స్పేస్, బూట్ స్పేస్ పరంగా జిమ్నీ ఎక్కువ సౌకర్యాన్ని ఇస్తుంది.
Maruti Suzuki Jimny
ఈ రెండు కార్లలో ఏది కొనాలనేది పూర్తిగా మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది.
మీరు జిమ్నీని ఎందుకు కొనాలి?
మీరు థార్ ఎప్పుడు కొనాలి?
ఇండియాలో అమ్మకాల పరంగా థార్‌కు డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఆఫ్-రోడర్‌గా జిమ్నీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.