ప్రముఖ వాహన తయారీదారు మారుతీ సుజికీ సంస్థ తన వాహన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సమయంలో మారుతీ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. దీంతో గురుగ్రామ్, మానేసర్ ప్లాంట్లలో ఈనెల 7వ, 9వ తేదీన రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్(బీఎస్ఈ)కి ఆ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్ కూడా చేసింది. ఆ
ర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా ఆటో ఇండస్ట్రీకి చెందిన పలు సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాహనాల అమ్మకాలు పడిపోవడంతో.. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది కూడా ఉద్యోగాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఆటోమొబైల్ రంగంలో 3.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మన్మోహన్ అన్నారు.