ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి గుడ్‌న్యూస్. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో వేలాది జాబ్స్ కోసం బ్యాంకులు నోటిఫికేషన్స్ ఇవ్వనున్నాయి. అన్ని బ్యాంకులు కలిపి దాదాపు 50,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి. వాటిలో 21 వేల మందిని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు, మిగితా వారిని క్లర్క్, ఇతర ఉద్యోగాల కోసం నియమించుకోనున్నాయి.
ప్రభుత్వ రంగంలో 12 బ్యాంకులు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ 20,000 మందిని నియమించుకోనుంది. ఆ బ్యాంక్ ఇప్పటికే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసుకుని, 13,455 జూనియర్ అసోసియేట్స్ భర్తీని కూడా చేపట్టింది. పీఎన్‌బీ కూడా 5,500 పోస్టులను భర్తీ చేయనుంది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 మందిని ఉద్యోగాల్లో నియమించుకోనుంది.
మరోవైపు, సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. వాటిని స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల్లో లిస్ట్ చేసి రాబడులు పెంచుకోవాలని చెప్పింది. దీంతో సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
వర్గం | ఉద్యోగాల సంఖ్య |
---|---|
మొత్తం నియామకాలు | 50,000 |
ఆఫీసర్ స్థాయి | 21,000 |
క్లర్క్, ఇతర ఉద్యోగాలు | 29,000 |
బ్యాంక్ పేరు | ఉద్యోగాల సంఖ్య |
---|---|
ఎస్‌బీఐ (State Bank of India) | 20,000 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) | 5,500 |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 4,000 |