Meet Pearl Kapur, India's youngest billionaire and founder of Zyber 365
Pearl Kapur : సక్సెస్ ఎవరి సొత్తు కాదు.. అనుకుంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు.. ఇది అక్షరాలా సత్యమని నిరూపించాడో యువ వ్యాపారవేత్త.. ఇతడి పేరు పెరల్ కపూర్.. వయస్సు చూస్తే కేవలం 27 ఏళ్లు మాత్రమే.. అతడి సక్సెస్ గురించి వింటే ఎవరైనా అబ్బురపోవాల్సిందే.. అతి పిన్నవయస్సులోనే బిలియనీర్ స్థాయికి ఎదిగాడు.
కేవలం 90 రోజుల వ్యవధిలోనే భారత్‌లోనే యంగెస్ట్ బిలియనీర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దేశీయ కుబేరులైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అంబానీలు ఎన్ని ఏళ్ల కృషితో బిలియనీర్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు వారికన్నా తక్కువ సమయంలోనే బిలియనీర్‌గా ఎదిగి వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడు ఈ యువ పారిశ్రామికవేత్త.. ఈ క్రమంలోనే దేశీయ యువ పారిశ్రామికవేత్తలందరికి పేరోల్ ఆదర్శంగా నిలిచాడు.
జైబర్ 365 కంపెనీలో 90 శాతం వాటా ఇతడిదే :
ఈ యువ బిలియనీర్ గుజరాత్ చెందినవాడు కాగా.. 2023 మేలో జైబర్ 365 అనే స్టార్టప్ కంపెనీని స్థాపించాడు. దీని హెడ్ ఆఫీసు లండన్‌లో ఉంది. కానీ, గుజరాత్‌లో అహ్మదాబాద్ నుంచి ఈ కంపెనీ కార్యాకలాపాలతో మరింత ప్రాచుర్యాన్ని పొందింది. జైబర్ 365 అనేది Web3, ఏఐ-ఆధారిత ఓఎస్ స్టార్టప్ కంపెనీ. కేవలం మూడు నెలల (90 రోజులు) వ్యవధిలోనే రూ.9840 కోట్లకు ఎగబాకింది.
భారత్ సహా ఆసియా రెండింటిలోనూ వేగంగా వృద్ధిచెందుతున్న 1.2 బిలియన్ డాలర్ల విలువైన యూనికార్న్ కంపెనీగా అవతరించింది. ఇందులో గుజరాత్ వ్యాపారవేత్త ప్రధానంగా 90 శాతం వాటా కలిగి ఉండటంతో అతని నికర విలువ 1.1 బిలియన్ డాలర్లు. దాంతో మూడు నెలల్లోనే ఈ స్టార్టప్ కంపెనీ యూనికార్న్ స్టేటస్ అందుకుంది. సాధారణంగా బిలియన్ల డాలర్లు విలువ కలిగి ఉంటే.. అలాంటి కంపెనీని యూనికార్న్‌గా గుర్తిస్తారు.
పెరల్ కపూర్ సక్సెస్ జర్నీ మొదలైందిలా :
యువ బిలియనీర్ సక్సెస్ జర్నీ.. ముందుగా (AMPM) స్టోర్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మొదలైంది. యాంటీయర్ సొల్యూషన్స్‌కు బిజినెస్ అడ్వైజర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలా అతని ప్రయాణం ప్రారంభమైంది. జైబర్ 365కి ముందు, కపూర్ ఫిబ్రవరి 2022లో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని కూడా స్థాపించాడు. క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుంచి ఎంఎస్‌సీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్‌వే)లో కపూర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అదే అతడిలో వ్యాపార ప్రపంచంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకునేలా అవసరమైన నైపుణ్యాలను అందుకునేలా చేసింది.
100 మిలియన్ డాలర్లతో తొలి పెట్టుబడి :
జూలై 2023లో స్టార్టప్ Zyber 365 కంపెనీ మొదటి ఇన్వెస్ట్ మెంట్‌లోనే 100 మిలియన్ డాలర్లతో దూసుకుపోయింది. ఈ కంపెనీ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యవసాయ సంస్థ అయిన (SRAM) అండ్ (MRAM) గ్రూప్ నుంచి 8.3 శాతం పెట్టుబడి అందుకుంది. అప్పుడే పెరల్ కపూర్ భవిష్యత్తును ఊహించాడు. ఇందులో బ్లాక్‌చెయిన్, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి ఎక్స్‌పోనెన్షియల్ టెక్నాలజీలతో ప్రపంచ స్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయగలవని విశ్వసించాడు. అప్పటినుంచి కంపెనీ వృద్ధికోసం ఎంతగానో శ్రమించాడు. అలా మొదలైన అతడి సక్సెస్ జర్నీ యువ బిలియనీర్ స్థాయికి ఎదిగేలా చేసింది.
Read Also : Asus Chromebook CM14 : అసూస్ క్రోమ్‌బుక్ సీఎమ్14 కొత్త ల్యాప్‌టాప్ ఇదిగో.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?