భారీ జీతం సంపాదించాలని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. కొంత మంది మాత్రమే తమ టాలెంట్, కృషి, నిబద్ధతతో కలల్ని నిజం చేసుకుంటారు. అలాంటి వారిలో ఒకరు ట్రపిట్ బన్సాల్. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈ యువకుడికి మెటా కంపెనీ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చింది. Superintelligence టీమ్‌లో చేరేందుకు రూ.854 కోట్లు ప్యాకేజ్ ఆఫర్ చేశారు.
ట్రపిట్ బన్సాల్ ఎవరు?
ట్రపిట్ బన్సాల్ 2007 నుంచి 2012 వరకు ఐఐటీ కాన్పూర్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఇంటిగ్రేటెడ్) మాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ చదివారు. 2015లో యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ అంహర్స్ట్‌లో ఎమ్మెస్, కంప్యూటర్ సైన్స్ చేశారు.
అదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. యాక్సెంచర్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ లో అనలిస్ట్‌గా, ఫేస్‌బుక్‌లో 2016లో రీసెర్చ్ ఇంటర్న్‌గా పని చేశారు. 2017లో ఓపెన్‌ఏఐ, 2018 మేలో గూగుల్, 2020 జూన్‌లో మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌గా పని చేశారు.
Also Read: 2025లో అదరగొట్టేస్తున్న టాప్ 5 AI స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ రేంజ్‌లో ఉన్నాయంటే?
యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ అంహర్స్ట్‌లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు. 2022 జనవరిలో ఓపెన్‌ఏఐలో టెక్నికల్ స్టాఫ్‌గా చేరారు. 2025 జూలై 1న ట్రపిట్ బన్సాల్ ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. “Metaలో చేరడం ఆనందంగా ఉంది. Superintelligence ఇక దూరం కాదు” అని పోస్ట్ చేశారు.
బన్సాల్ “01” అనే మోడల్‌ను రూపకల్పన చేశారు. ప్రస్తుతం Meta Superintelligence టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు. Meta అతనికి రూ. 854 కోట్ల ప్యాకేజ్ ఆఫర్ చేసింది. Superintelligence గ్రూప్‌లో పనిచేస్తున్న వారు ప్రపంచ ప్రధాన బ్యాంకుల సీఈవోల కంటే అత్యధిక వేతనం పొందుతున్నారు.
Bloomberg నివేదిక ప్రకారం.. Meta Superintelligence Lab (MSL) నియామకాలకు ఇచ్చే ప్యాకేజీలో బేస్ సాలరీ, సైన్‌బోనస్, Meta స్టాక్‌లో భారీ షేర్ ఉంటాయి. డీల్‌లో ఎక్కువ భాగం ఈక్విటీ రూపంలోనే ఉంటుంది. ప్రారంభ జీతం, బోనస్‌లు నగదు రూపంలో భారీగా ఉంటాయి. ఒక ఉద్యోగి స్టార్ట్‌అప్‌లో ఉన్న పెద్ద ఎక్విటీ వాటాను వదిలిపెట్టి మెటాలో చేరుతున్నపుడు, ఆ నష్టాన్ని పూరించేందుకు సైన్‌బోనస్‌ను ఎక్కువగా ఇస్తారు.