MG Astor 2024 Launch : కొంటె ఇలాంటి కారు కొనాల్సిందే.. రూ.9.98 లక్షలకు ఎంజీ ఆస్టర్ 2024 వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

MG Astor 2024 Launch : కొత్త కారు కొంటున్నారా? ఎంజీ ఆస్టర్ 2024 కొత్త ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

MG Astor 2024 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా ఎంజీ ఆస్టర్ 2024ని రూ. 9.98 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఈ వెహికల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా ఉబాన్ క్రూయిజర్ హైర్డర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటితో పోటీగా భారత మార్కెట్లోకి వచ్చింది.

రెండు ఇంజన్ ఆప్షన్లతో పెట్రోల్ ఓన్లీ ఎస్‌యూవీ :
ఎంజీ ఆస్టర్ 2024 స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, సావీ ప్రో వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. పెట్రోల్-ఓన్లీ ఎస్‌యూవీ అయినందున, ఎంజీ ఆస్టర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లను కలిగి ఉంది. 1.5-లీటర్ సహజంగా యూనిట్ (110బీహెచ్‌పీ 144ఎన్ఎమ్) 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ (140బీహెచ్‌పీ 220ఎన్ఎమ్). 1.5-లీటర్ ఇంజిన్‌ను 6-స్పీడ్ ఎంటీ లేదా సీవీటీతో చేయవచ్చు, 1.3-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ ఏటీకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.

Read Also :  Apple iPhone 13 Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. రూ.50వేల లోపు ధరకే ఆపిల్ ఐఫోన్ 13 సొంతం చేసుకోండి

80కిపైగా ఐ-స్మార్ట్ 2.o కనెక్ట‌డ్ ఫీచర్లు :
ఎంజీ ఆస్టర్ 2024లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, అధునాతన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అప్‌డేట్ చేసిన ఐ-స్మార్ట్ 2.0 80కి పైగా కనెక్ట్ చేసిన ఫీచర్లు ఉన్నాయి.

అత్యాధునిక స్పెషిఫికేషన్లు  :
ముఖ్యమైన ఐ-స్మార్ట్ 2.0 ఫీచర్లలో జియో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్, వాతావరణం, క్రికెట్ అప్‌డేట్‌లు, కాలిక్యులేటర్, గడియారం, తేదీ/డే ఇన్ఫర్మేషన్, జాతకం, డిక్షనరీ, వార్తలు, నాల్డెజ్ కోసం అధునాతన వాయిస్ కమాండ్‌లు ఉన్నాయి. అధునాతన యూఐ మల్టీ హోమ్ పేజీలతో హోమ్ స్క్రీన్‌పై విడ్జెట్ కస్టమైజేషన్ ఐ-స్మార్ట్ మొబైల్ యాప్ ద్వారా తేదీ కస్టమైజేషన్ అనుమతించే హెడ్ యూనిట్‌లో యూనిక్ బర్త్‌డే ఫీచర్‌ కలిగి ఉంటుంది.

MG Astor 2024 launch

అత్యాధునికమైన ఆటోమొబైల్ టెక్నాలజీని ప్రదర్శించే ప్రొడక్టులతో కస్టమర్ల అంచనాలను అందుకోవడానికి కట్టుబడి ఉన్నామని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా అన్నారు. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ బ్రాండ్‌గా ఈ ఏడాదిలో శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఆస్టర్ 2024 లైనప్ ఫీచర్లు, డిజైన్, అద్భుతమైన ఆప్షన్లను అందిస్తుంది.

ఎంజీ ఆస్టర్‌లో 49 భద్రతా ఫీచర్లు :
ఎంజీ ఆస్టర్ భారత మార్కెట్లో పర్సనల్ ఏఐ అసిస్టెంట్ 14 ఆటోమనస్ లెవల్ 2 ఫీచర్లు, మిడ్-రేంజ్ రాడార్లు, మల్టీ-పర్పస్ కెమెరాతో పొందిన ఫస్ట్ ఎస్‌యూవీ. అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ల రేంజ్ కలిగి ఉంది. ఎంజీ ఆస్టర్ 49 భద్రతా ఫీచర్లతో వస్తుంది.

Read Also :  Oppo Reno 11 5G Series : రూ. 30వేల లోపు ధరకే ఒప్పో రెనో 11 సిరీస్ వచ్చేసింది.. ఈ నెల 18 నుంచే సేల్.. డోంట్ మిస్!

ట్రెండింగ్ వార్తలు