MG Windsor EV : కారు అంటే ఇలా ఉండాలి.. ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు చూశారా? సింగిల్ ఛార్జ్‌తో 332 కి.మీ రేంజ్..!

MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? ఈ కొత్త కారు అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 332 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు.

MG Windsor EV

MG Windsor EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఇంధన కార్ల కన్నా ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారులు ఈవీ కార్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also : Top Budget Phones : ఫీచర్ ఫోన్లు అదుర్స్.. రూ. 5వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

డిజైన్, అద్భుతమైన లుక్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. సింగిల్ ఛార్జ్‌లో అత్యుత్తమ రేంజ్ పర్ఫార్మెన్స్ అందించే ఈవీ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఎలక్ట్రిక్ కారును కొనేందుకు ఇష్టపడుతున్నారు.

మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం.. ఎంజీ విండ్సర ఈవీ కారు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ కారు మల్టీ ఫీచర్లు, స్పీడ్ ఫంక్షన్లతో వస్తుంది. అంతేకాదు.. ఈ ఎంజీ విండ్సర్ కారు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 332 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కారులో మీరు నగరమంతా ఫ్యామిలీతో కలిసి చుట్టేయొచ్చు.

ఎంజీ విండ్సర్ ఈవీ డిజైన్, స్పెసిఫికేషన్లు :
ఎంజీ విండ్సర్ మీ ఫ్యామిలీ కోసం రోజువారీ వినియోగానికి బెస్ట్ కారు. ఈ మిడ్ సైజు ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అత్యల్ప ధర పరిధిలో ఎంజీ విండ్సర్ కొనుగోలు చేయొచ్చు. ఈ కారు డిజైన్ చాలా సింపుల్ ట్రెడెషన్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు బోనెట్ కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మోడ్రాన్ లుక్, క్లాసిక్ రెండింటినీ కలిగిన డిజైన్‌ మరింత ఆకట్టుకుంటోంది.

ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ, 332 కి.మీ పరిధి :
ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్, రేంజ్ విషయానికి వస్తే.. కంపెనీ 38kWh ఫెర్రో-ఫాస్ఫేట్ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించింది. ఆ మోటారు 134bhp శక్తిని, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు అద్భుతమైన పరిధితో వస్తుంది. విండ్సర్ EV కారు 332 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. విండ్సర్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120 కి.మీ వరకు దూసుకెళ్లగలదు.

Read Also : Elon Musk Net Worth : ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు టెస్లా షేర్లు భారీగా పతనం.. ఒక్కరోజే రూ.38వేల కోట్లు నష్టపోయిన ఎలన్ మస్క్..!

ఎంజీ విండ్సర్ EV ధర ఎంతంటే? :
ఎంజీ విండ్సర్ కారు మల్టీ వేరియంట్‌లు, ఫీచర్లతో వస్తుంది. ఈ కారు ధర రూ. 14 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 16 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంటుంది. ఈ విండ్సర్ కారు 3 నుంచి 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే, ఈ కారు లోపలి భాగంలో కంపెనీ అదిరిపోయే ఇంటర్‌ఫేస్‌తో యాంబియంట్ లైటింగ్‌ను అమర్చింది.

ఎంజీ విండ్సర్ ఈవీ బ్రేక్‌లు :
స్పీడ్ బ్రేకింగ్ కోసం కంపెనీ డిస్క్ బ్రేక్ ఆప్షన్లను ఉపయోగించింది. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ రెండు వైపులా సస్పెన్షన్‌ను కూడా ఉపయోగిస్తుంది.