Top Budget Phones : ఫీచర్ ఫోన్లు అదుర్స్.. రూ. 5వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. ఇప్పుడే కొనేసుకోండి!
Top Budget Phones : కొత్త ఫీచర్ ఫోన్ కావాలా? రూ. 5వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Top Budget Phones
Top Budget Phones : కొత్త ఫోన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే ఫీచర్ ఫోన్లు కూడా అంతే స్థాయిలో మంచి పర్ఫార్మెన్స్ అందిస్తాయి. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ఆధిపత్యం ఉన్నప్పటికీ ఫీచర్ ఫోన్ల డిమాండ్ అలానే కొనసాగుతోంది.
చాలామంది వినియోగదారులు ఫీచర్ ఫోన్లు కొనేందుకు ఇష్టపడతారు. రోజువారీ వినియోగానికి మంచి బ్యాటరీ లైఫ్, కేవలం బ్యాకప్ ఫోన్‌గా ఈ ఫీచర్ ఫోన్‌లు ఉపయోగపడతున్నాయి. మీరు కూడా ఏదైనా ఫీచర్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి.
ఎందుకంటే.. రూ. 5వేల లోపు టాప్ బడ్జెట్ ఫీచర్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఒక ఫీచర్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. ఈ 4 ఫీచర్లలో ఏయే ఫీచర్లు, ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.
నోకియా 2660 ఫ్లిప్ :
నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. స్మాల్ బాడీతో లోపల 2.8-అంగుళాల స్క్రీన్ ఉన్నాయి. కాల్స్ లేదా మెసేజ్ చూసేందుకు బయట సెకండరీ డిస్‌ప్లే కూడా ఉంది. బ్యాక్ సైడ్ 0.3MP కెమెరా ఉంది. యూనిసోక్ T107 చిప్, 48MB ర్యామ్‌పై రన్ అవుతుంది.
మీరు మెమరీ కార్డ్ ద్వారా 32GB వరకు సపోర్టుతో 128MB ఇంటర్నల్ మెమరీని అందుకుంటారు. 1450mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి వస్తుంది. ప్రస్తుతం ఈ నోకియా ఫోన్ ధర సుమారు రూ.4,299 నుంచి లభ్యమవుతోంది.
జియోఫోన్ ప్రైమా 2 4G :
జియోఫోన్ ప్రైమా 2 (KaiOS) ద్వారా పవర్ పొందుతుంది. 2.4-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు రెండూ 0.3MP కలిగి ఉంటాయి. సాధారణ వినియోగానికి బెస్ట్ మోడల్. 512MB ర్యామ్, 4GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. మైక్రో SD ద్వారా గరిష్టంగా 128GB వరకు సపోర్టు ఇస్తుంది. Wi-Fi, 4G సపోర్టు చేస్తుంది. 2000mAh వద్ద బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ధర సుమారు రూ. 2,799కు పొందవచ్చు.
లావా A5 2025 :
మీరు ఏదైనా అల్ట్రా-బేసిక్ ఫోన్ కోసం చూస్తున్నారా? లావా A5 బెస్ట్ ఫోన్. 2.4-అంగుళాల స్క్రీన్, 0.3MP బ్యాక్ కెమెరాను అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా లేదు. 32MB ర్యామ్, 24MB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మెమరీ కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. Wi-Fi ఆప్షన్ లేదు. GPS, 4G కూడా లేదు.
రికార్డింగ్‌తో కూడిన FM రేడియో మాత్రం ఉంది. 1200mAh రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు ఛార్జింగ్ ఉంటుంది. అత్యంత సరసమైన ఫోన్లలో ఇదొకటి. దాదాపు రూ. 1,221 ధరకు అందుబాటులో ఉంది.
ఐటెల్ ఫ్లిప్ వన్ :
ఐటెల్ ఫ్లిప్ వన్ 2.4-అంగుళాల ఎల్‌సీడీ, 0.8MP బ్యాక్ కెమెరాను తీసుకొచ్చింది. సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో లేదు. 4MB ర్యామ్, 4MB స్టోరేజీతో చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, మెమరీ కార్డులకు సపోర్టు ఇస్తుంది. ఐటెల్ ఫోన్ 208MHz ప్రాసెసర్‌తో యూనిసోక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
1200mAh బ్యాటరీ సామర్థ్యంతో సాధారణ వినియోగానికి సరిపోతుంది. 4G, Wi-Fi సపోర్టు లేదు. కానీ, బ్లూటూత్, USB-C ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ ఫోన్ ధర పెరిగింది. ప్రస్తుతం ఈ ఐటెల్ ఫ్లిప్ ఫోన్ ధర సుమారు రూ. 2,166 నుంచి అందుబాటులో ఉన్నాయి.
జియోఫోన్ ప్రైమా 2 ఫోన్ 4G, Wi-Fi కనెక్టవిటీతో పాటు మెమరీ స్టోరేజీని కలిగి ఉంది. మీరు ఫ్లిప్ ఫోన్‌లను ఇష్టపడితే నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ బెస్ట్ మోడల్ అని చెప్పవచ్చు. మీరు కేవలం సాధారణ బ్యాకప్ ఫోన్‌ను కోరుకుంటే.. ఐటెల్ ఫ్లిప్ వన్, లావా A5 బెస్ట్ ఫోన్. ఈ మూడింటినీ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.