Summer ACs Sale : అమెజాన్‌లో కొత్త ఏసీలపై అద్భుతమైన డిస్కౌంట్లు.. తక్కువ ధరకే కొనితెచ్చుకోండి.. మీ ఇల్లంతా కూల్ కూల్..!
Summer ACs Sale : కొత్త ఏసీ కొంటున్నారా? రూ.30వేల లోపు ధరలో అద్భుతమైన టాప్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు.

Top Inverter Split AC
Summer ACs Sale : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అసలే సమ్మర్ సీజన్.. ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు చాలామంది కొత్త ఏసీలను కొనేందుకు ఆసక్తిచూపిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరకే స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లు లభిస్తున్నాయి.
వేసవిలో ఇంటిని కూల్‌గా మార్చుకోవడానికి ఇదే సరైన మార్గం. వేసవి రాకముందే మీ ఇంట్లో మంచి ఏసీని కొనితెచ్చుకోవచ్చు. అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఇప్పుడు రూ.30వేల కన్నా తక్కువ ధరకు బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలను పొందవచ్చు.
Read Also : Airtel vs Jio : ఎయిర్‌టెల్, జియో యూజర్లకు అలర్ట్.. 90 రోజుల రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్?
ఎండలు పెరిగేకొద్దీ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు (AC) కూడా ఖరీదైనవి అవుతాయి. మీరు కొత్త ఎయిర్ కండిషనర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని చూస్తుంటే.. చాలా మోడల్‌లు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఏసీల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఏసీని ఎంచుకుని వెంటనే ఇంటికి కొనితెచ్చుకోండి.
వోల్టాస్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
వోల్టాస్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రస్తుత ధర దాదాపు రూ. 30,990కు ఉండగా, దీనిపై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు బ్యాంక్ కార్డ్‌తో అదనంగా రూ. 1,500 డిస్కౌంట్ పొందవచ్చు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో ఈ ఎయిర్ కండిషనర్ పవర్ ఆదా చేయొచ్చు. 4-ఇన్-1 అడ్జస్టబుల్ మోడ్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
లాయిడ్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC, 1.0 టన్ :
మీరు ఇప్పుడు ఈ 1 టన్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్‌ను 38శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ లాయిడ్ ఏసీ ధర కేవలం రూ. 30,990 మాత్రమే. అదనంగా రూ. 500 ఇన్‌స్టంట్ కూపన్‌ను అందిస్తుంది. మీరు బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే.. అదనంగా రూ. 1,500 తగ్గింపు లభిస్తుంది. 5-ఇన్-1 కన్వర్టిబుల్ ఫంక్షన్, కాపర్ కాయిల్, యాంటీ-వైరల్+PM 2.5 ఫిల్టర్‌తో వస్తుంది. ఈ ఏసీ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది.
గోద్రేజ్ స్ప్లిట్ ఏసీ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ :
అమెజాన్ ప్రస్తుతం గోద్రెజ్ 1 టన్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీపై 30శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. 5 ఏళ్ల వారెంటీతో పాటు 5-ఇన్-1 కూలింగ్ మోడ్ ఉన్నాయి. ఈ ఏసీ కేవలం రూ. 29,490కు అందిస్తోంది. మీరు బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే అదనంగా రూ. 1,500 తగ్గింపు కూడా పొందవచ్చు. పవర్ కూలింగ్‌తో పాటు ఈ 1 టన్ 5-ఇన్-1 కన్వర్టిబుల్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ విద్యుత్ సేవింగ్ కోసం 3-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది.
హైయర్ 1 టన్ ట్రిపుల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
బ్రాండెడ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ 50శాతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ధర కేవలం రూ. 30,990 మాత్రమే. అలాగే, రూ. వెయ్యి ఇన్‌స్టంట్ వోచర్ కూడా ఉంది. బ్యాంక్ కార్డ్‌తో అదనంగా రూ. 1,500 బోనస్ పొందవచ్చు. 7-ఇన్-1 కన్వర్టిబుల్ మోడ్, ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్, హెచ్‌డీ ఫిల్టర్, 54 డిగ్రీల సెల్సియస్ వరకు కూలింగ్ కెపాసిటీ, లాంగ్ ఎయిర్ త్రో వంటి పవర్‌ఫుల్ ఫీచర్లు ఈ మోడల్‌లో అందుబాటులో ఉన్నాయి. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది.
వర్ల్పూల్ 1.0 టన్ 3 స్టార్, మ్యాజికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
వర్ల్పూల్ 1 టన్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ 48శాతం తగ్గింపుతో అమ్మకానికి ఉంది. కేవలం రూ.29,990కే ఈ ఏసీని కొనుగోలు చేయొచ్చు. అలాగే, ఈ ఏసీపై రూ.500 డిస్కౌంట్ కోడ్‌ను అందుకుంటారు. మీరు బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే.. అదనంగా రూ.1,500 తగ్గింపును కూడా పొందవచ్చు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగిన ఎయిర్ కండిషనర్ విద్యుత్తును ఆదా చేస్తుంది. HD ఫిల్టర్, కన్వర్టిబుల్ 4-ఇన్-1 కూలింగ్ మోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది.