Petrol-Diesel Prices : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరల తగ్గింపు? మోదీ సర్కారు యోచన

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవునంటున్నాయి అధికార బీజేపీ వర్గాలు. 2024వ సంవత్సరంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తోంది....

Petrol-Diesel

Petrol-Diesel Prices : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? అంటే అవునంటున్నాయి అధికార బీజేపీ వర్గాలు. 2024వ సంవత్సరంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించి, మోదీ ప్రభుత్వం పెట్రోల్-డీజిల్ ధరలను 10 రూపాయల వరకు తగ్గించవచ్చునని భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సామాన్యులకు పెద్ద ఊరట కల్పించాలని కేంద్రం యోచిస్తోందని చెబుతున్నారు. ప్రధాని మోదీ ఆమోదం కోసం పెట్రోలియం మంత్రిత్వ శాఖ రెండు ఇంధనాల్లో లీటరుకు 8 నుంచి 10 రూపాయల తగ్గించే ప్రతిపాదనను సిద్ధం చేసిందని, ఇది త్వరలో ఆమోదం పొందవచ్చని కేంద్ర అధికారవర్గాలు తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్ 6వతేదీ నుండి ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంధనం యొక్క ప్రీ-రిఫైనరీ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు.

ALSO READ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై మైనే రాష్ట్ర ఎన్నికల అధికారి అనర్హత వేటు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఆయిల్ కార్ప్, భారత్ పెట్రోలియం కార్ప్,హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ ముడి చమురు తక్కువ ధరల నుంచి భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మూడు చమురు కంపెనీలు సంయుక్తంగా 58,198 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 96.72 రూపాయలుగా ఉంది.

ALSO READ : అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు

రాజస్థాన్‌లో ఈ ధర 109.34 రూపాయలు. హర్యానాలో 97.31, యూపీలో 97.05, పంజాబ్‌లో లీటరు పెట్రోలు ధర 98.45 రూపాయలుగా ఉంది. డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో లీటరుకు రూ.89.62, యూపీలో 90.16 రూపాయలు, పంజాబ్‌లో రూ.88.57,హర్యానాలో లీటరుకు 90.16 రూపాయలుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలగనుంది.

ట్రెండింగ్ వార్తలు