భారత ప్రభుత్వం మరో 100 ఎయిర్ పోర్టులు ప్రారంభించనుంది. ఆసియాలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు 2024 నాటికల్లా ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని చూస్తుంది. పట్టణాలు, గ్రామాల నుంచి దాదాపు వెయ్యి రూట్లను అనుసంధానం చేస్తూ వీటి నిర్మాణం చేయనున్నారు. 2025నాటికల్లా 5ట్రిలియన్ డాలర్లు టార్గెట్‌గా పెట్టుకుని కార్యచరణ మొదలుపెట్టనుంది.
కొద్ది నెలలుగా ఆర్థిక సంక్షోభ సూచనలు కనిపిస్తున్న తరుణంలో వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలతో పోటీపడుతూ కార్పొరేట్ పన్నును ఎత్తివేసింది మోడీ ప్రభుత్వం. 2035 కల్లా 450 కమర్షియల్ ఎయిర్ పోర్టులు స్థాపించాలన్న దానిలో భాగంగానే ఈ వంద ఎయిర్‌పోర్టులు మొదలుపెట్టారు. అంటే 2018లో ఉన్నవాటికంటే రెట్టింపు చేస్తారన్నమాట.
ఈ సర్వీసుల కోసం ముందుగానే ప్రణాళికలు రచించిన కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పైలట్లకు శిక్షణ ఇస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ రూపాయలు కచ్చితంగా వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తోంది భారత ప్రభుత్వం. మూడేళ్ల క్రితం భారత్ లో ఉన్న 450రన్ వేలలో 75మాత్రమే పనిచేసేవి. మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వాటితో పాటు మరన్ని రన్ వేలు అందుబాటులోకి రానున్నాయి.