Moto Edge 50 Pro
Moto Edge 50 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా లేటెస్ట్ ఫోన్ మోటో 60 ఫ్యూజన్ ఏప్రిల్ 2న ఆవిష్కరించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రాకముందే.. మోటోరోలా మరో మోడల్ మోటో ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
గత ఏప్రిల్‌లో ప్రీమియం ధరకు లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 50 ప్రో ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉంది. మోటోరోలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో ఎడ్జ్ 50 ప్రో ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగి ఉంది. ఫొటోగ్రఫీ, గేమింగ్ ఔత్సాహికులకు అద్భుతమైన ఫోన్ అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మిలియన్ల మంది కస్టమర్లకు ఈ ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మోటో ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటో ఎడ్జ్ 50ప్రో ధర రూ.41,999కి లిస్టు అయింది. అయితే కస్టమర్లు 28 శాతం భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మోటోరోలా ధర కేవలం రూ.29,999కి తగ్గుతుంది. ఈ హై-ఎండ్ ఫోన్ భారీ తగ్గింపు పొందడం ఇదే మొదటిసారి. ధర తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది.
మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే.. మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా భారీ సేవింగ్స్ పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను రూ.27,700 వరకు ట్రేడ్ చేయవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు రూ.12వేల ఎక్స్ఛేంజ్ వాల్యూతో మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రూ.18వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో అల్యూమినియం ఫ్రేమ్‌తో ఎకో-లెదర్ బ్యాక్‌ను కలిగి ఉంది. అద్భుతమైన 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందుకోనుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోలో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ ప్రియులు 50MP, 10MP, 13MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో బ్యాక్ సెటప్‌ను పొందవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరా అందుబాటులో ఉంది. చివరగా, 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4500mAh బ్యాటరీతో వస్తుంది.