Hero Karizma XMR 250 : యూత్‌కు కిక్కెక్కించే న్యూస్.. స్పోర్ట్స్ లుక్‌‌తో హీరో కొత్త కరిజ్మా స్టైలిష్ బైక్‌ వస్తోంది.. భలే ఉంది భయ్యా బైక్..!

Hero Karizma XMR 250 : కొత్త బైక్ కొంటున్నారా? యువత కోసం స్పోర్ట్స్ లుక్‌తో హీరో కొత్త కరిజ్మా స్టైలిష్ బైక్ వచ్చేస్తోంది. బైక్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధర పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Hero Karizma XMR 250 : యూత్‌కు కిక్కెక్కించే న్యూస్.. స్పోర్ట్స్ లుక్‌‌తో హీరో కొత్త కరిజ్మా స్టైలిష్ బైక్‌ వస్తోంది.. భలే ఉంది భయ్యా బైక్..!

Hero Karizma XMR 250

Updated On : April 2, 2025 / 3:33 PM IST

Hero Karizma XMR 250 : యువతకు గుడ్ న్యూస్.. కొత్త సూపర్ బైక్ వచ్చేస్తోంది.. హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త కరిజ్మా బైక్ లాంచ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో అద్భుతమైన స్పోర్ట్స్ బైక్ తీసుకొస్తోంది.

Read Also : Vivo V50 Price : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇంకా తగ్గొచ్చు కూడా..!

ప్రత్యేకించి యువత కోసం సరసమైన ధరలో బెస్ట్ స్టైలిష్ బైక్‌ను తయారు చేస్తోంది. ఈ హీరో మోటార్‌తో పాటు కొత్త మోటార్‌సైకిల్ హీరో కరిజ్మా XMR 250 బైక్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ బైక్ స్పోర్ట్స్ లుక్‌తో పాటు మల్టీ కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కరిజ్మా సూపర్ బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో కరిజ్మా XMR 250 డిజైన్ :
హీరో బైక్ తయారీదారు ఈ కరిజ్మా బైక్‌ను యువత కోసమే తయారు చేసింది. ఎందుకంటే.. కవాసకి నింజా మాదిరిగా స్పోర్టీ లుక్, ఆకర్షణీయమైన డిజైన్‌ను కోరుకుంటారు. ఈ బైక్ కలర్ హీరో 250 బ్రాండింగ్‌తో ఇతరులకన్నా అద్భుతంగా ఉంటుంది. హీరో కరిజ్మా బాడీవర్క్స్ బిగ్ విండ్‌షీల్డ్, హెడ్‌లైట్ల కింద వింగ్‌లెట్‌లు, సరైన ఫుల్ ఫెయిరింగ్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపిస్తాయి. కంపెనీ బైక్‌లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కూడిన డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన USB ఛార్జింగ్ పోర్ట్ నావిగేషన్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌లైట్‌ల సెటప్‌తో కాల్ అలర్ట్, SMS అలర్ట్ ఆప్షన్ వంటి అదిరే ఫీచర్లను కూడా అందిస్తుంది.

హీరో కరిజ్మా XMR 250 పవర్, టాప్ స్పీడ్ :
హీరో కరిజ్మా XMR 250 బైక్ మోడల్ 250cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 30ps పవర్, 25Nm టార్క్‌ను అందిస్తుంది. బెస్ట్ ఇంజిన్ కాంబినేషన్ బైక్ తయారీదారు BS6 ఇంజిన్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. కరిజ్మా XMR 250 టాప్ స్పీడ్ గంటకు 150mph వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

Read Also : SIP Calculator : మీరు అనుకోండి సామీ.. ఈ SIP ఫార్ములాతో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. కేవలం రూ.20వేల పెట్టుబడితో కోట్లలో సంపాదన!

హీరో కరిజ్మా XMR 250 ధర, లాంచ్ తేదీ :
హీరో కరిజ్మా XMR 250 అంచనా ధర (ఎక్స్-షోరూమ్) రూ. 2 లక్షల నుంచి రూ. 2.20 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్‌తో కంపెనీ కొన్ని కొత్త యాక్సెసరీలను చేర్చింది. లాంచ్ తేదీ విషయానికి వస్తే.. హీరో కంపెనీ అక్టోబర్ 2025 లాంచ్ చేసే అవకాశం ఉంది.