SIP Calculator : మీరు అనుకోండి సామీ.. ఈ SIP ఫార్ములాతో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. కేవలం రూ.20వేల పెట్టుబడితో కోట్లలో సంపాదన!
SIP Calculator : మీరు కచ్చితంగా అనుకోవాలే గానీ, సరైన చోట పెట్టుబడి పెడితే మీరు ఊహించని లాభాలను పొందవచ్చు. SIP ఫార్ములా ఎంత పవర్ ఫుల్ అంటే.. కేవలం రూ. 20వేల పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు..

SIP Calculator
SIP Calculator : మీకు జీతం పడిందా? మీకు నెల జీతం పడగానే అందులో కొంత మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఖర్చులు తగ్గించుకుని ఈ మొత్తాన్ని ఏదైనా సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. మీరు అనుకోండి సామీ.. ప్రతి నెలా సరిగ్గా సేవింగ్ చేస్తూ పోతే కోట్లు సంపాదించవచ్చు.
భవిష్యత్తులో మీ అవసరాలకు సరిపోయేలా మంచి ఫండ్ ఉండాలంటే ఇప్పుడే మీరు SIPని ఎంచుకోవచ్చు. SIP 20x12x30 ఫార్ములా మీకు దీర్ఘకాలంలో అద్భుతమైన రాబడిని అందిస్తుంది. ఈ పెట్టుబడి ఫార్ములా ప్రకారం, రూ. 20,000 పెట్టుబడి మిమ్మల్ని 30 సంవత్సరాలలో 12 శాతం రాబడితో కోటీశ్వరుడిని చేస్తుంది. ఇంతకీ SIP 20x12x30 ఫార్ములా ఏమి చెబుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీ బంగారు భవిష్యత్తు కోసం సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. అందుకే SIP పెట్టుబడికి బెస్ట్ ఆప్షన్ అంటారు. మీరు కూడా ధనవంతులు కావాలనుకుంటే SIP ద్వారా సరైన పెట్టుబడిని ఎంచుకోండి. అయితే, SIPలో పెట్టుబడి పెట్టడానికి సరైన ఫార్మూలాను పాటించాలి. మీరు కూడా SIP ద్వారా డబ్బు సంపాదించాలంటే 20x12x30 ఫార్మూలను తప్పక పాటించాలి.
అప్పుడే మీరు ఆశించిన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. వాస్తవానికి, SIP 20x12x30 ఫార్ములా పెట్టుబడికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి నెలా రూ. 20వేల పెట్టుబడితో 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి 12శాతం రాబడితో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫార్ములాను ఉపయోగించి సరైన ప్రణాళికతో మీరు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సంపాదించుకోవచ్చు.
20x12x30 ఫార్ములాతో కోట్లలో సంపాదన ఎలా? :
ఎస్ఐపీ (SIP 20x12x30) ఫార్ములా భవిష్యత్తులో మంచి రాబడిని అందించే అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. తక్కువ సమయంలోనే కోట్ల డబ్బులను కూడబెట్టుకోవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం.. మీరు రూ. 20వేలు ప్రతి నెలా సేవింగ్ చేయాలి. 12 శాతం రాబడితో SIPలో పెట్టుబడి పెట్టాలి. ప్రతి ఒక్కరూ ఇలా 30 ఏళ్లు ప్రతి నెలా ఇదే మొత్తాన్ని పెట్టుబడిగా కొనసాగించాలి.
అప్పుడే 20x12x30 ఫార్ములాతో మీకు అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. ఈ ఫార్ములా కాంపౌండింగ్ మ్యాజిక్ చిన్నమొత్తంలో పెట్టుబడిని లక్షలుగా మార్చగలదు. దీర్ఘకాలిక క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టినవారికి ఆర్థిక భద్రత మాత్రమే కాదు.. మీ భవిష్యత్తులో అవసరాలకు కావాల్సినంత డబ్బు చేతికి అందుతుంది.
SIP 20x12x30 ఫార్ములా కాంపౌండింగ్‌తో మీరు లక్షల డబ్బులను కూడబెట్టవచ్చు. మీరు ప్రతి నెలా రూ. 10వేలు పెట్టుబడి పెట్టి.. ఆ పెట్టుబడిపై వార్షికంగా 12శాతం రాబడిని పొందితే.. ఒక ఏడాదిలో మీ కూడబెట్టిన డబ్బులు రూ. 1,27,665 అవుతుంది. అలాగే 30 ఏళ్ల తర్వాత మీరు లక్షాధికారి అవుతారు.
మీరు 12శాతం రాబడితో 30 ఏళ్ల పాటు రూ. 20వేలు పెట్టుబడి పెడితే.. పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 72 లక్షలు అవుతుంది. మీకు దాదాపు రూ. 5,44,19,464 వడ్డీ రాబడి లభిస్తుంది. దీని ప్రకారం.. మొత్తం కలిపి దాదాపు రూ. 6,16,19,464 వరకు చేతికి డబ్బులు అందుతాయి.
SIP పెట్టుబడికి (20x12x30) ఫార్ములా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫార్ములా ప్రకారం.. మీరు నెలకు రూ. 20వేలు పెట్టుబడి పెట్టాలి. ఈ రూ.20వేల పెట్టుబడిని 12 శాతం రాబడితో 30 సంవత్సరాలు కొనసాగించాలి. క్రమశిక్షణ, ఓపికతో ప్రతినెలా పెట్టుబడిని పెడుతూ వెళ్లాలి. అయితే, మీరు SIP కాలిక్యులేటర్ ఉపయోగించి కోటీశ్వరుడు ఎలా అవుతారో తెలుసుకోవచ్చు.
Note : పెట్టుబడిపై అందించే ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గమనించాలి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సంబంధించి లెక్కలు మొదలైనవి గురించి లోతుగా తెలుసుకోండి.