Vivo V50 Price : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇంకా తగ్గొచ్చు కూడా..!
Vivo V50 Price : వివో అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో V50 5G ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వివో ఫోన్ తక్కువలో వస్తుంటే ఇంకో ఫోన్ ఎందుకు అంటారా?

Vivo V50 Price Drop
Vivo V50 Price : వివో కొత్త ఫోన్ కొంటున్నారా? వివో 5G ఫోన్ భారీ డిస్కౌంట్‌కే లభ్యమవుతుంది. అద్భుతమైన 50MP సెల్ఫీ కెమెరాతో వివో V50 ఫోన్ కొనేసుకోండి. ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివో 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇదే ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పైగా రూ. 1500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డీల్ తక్కువ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భారత్‌లో Vivo V50 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వివో V50 ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999కు లభిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 13శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత వివో V50 ఫోన్ ధర రూ.36999కి పెరుగుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2500 డిస్కౌంట్ పొందవచ్చు.
అన్ని బ్యాంక్ కార్డ్‌లపై రూ.1500 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. రూ. 36,350 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటుందని గమనించాలి. అలాగే, ఈ వివో V50 ఫోన్ రూ. 6167 EMI ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు.
వివో V50 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
6.77-అంగుళాల పెద్ద అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ వివో ఫోన్ 4500 నిట్ బ్రైట్‌నెస్‌తో కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ 12GB (LPDDR4X) ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. మీ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయొచ్చు. 50MP మెయిన్ కెమెరా, 50MP వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ప్రైమరీ సెన్సార్ కూడా OIS సపోర్టుతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కూడా చూడొచ్చు.