Moto G85 5G
Moto G85 5G : మోటోరోలా అభిమానుల కోసం అద్భుతమైన డిస్కౌంట్.. మోటో G85 5G ఫోన్ భారత మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భారీగా తగ్గింది.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 20వ విడత రూ. 2వేలు పడే ముందు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ప్రీమియం డిజైన్‌తో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మోటో ప్రత్యేక ఫీచర్లలో లెదర్ బ్యాక్ ప్యానెల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
ప్రస్తుతం మోటో G85 5Gపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మోటో 5జీ ఫోన్ రూ. 10వేల లోపు ధరలో లభ్యమవుతుంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మోటో G85 5G డిస్కౌంట్ :
మోటోరోలా G85 5G ఫోన్ 128GB వేరియంట్ రూ.17,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ ఈ మోటోరోలా ఫోన్ (Moto G85 5G) ధర అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఇప్పుడు కేవలం రూ.15,999కి పొందవచ్చు. తద్వారా రూ.2వేలు ఆదా చేయొచ్చు.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుత ధర రూ.14,999కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే.. రూ.1,750 అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పాత స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రేడింగ్ చేస్తే ఇంకా తగ్గుతుంది. పాత ఫోన్ వాల్యూ రూ. 5వేలు అనుకుంటే.. మోటోరోలా G85 5G ఫోన్ కేవలం రూ. 10వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ, పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
మోటో G85 5G స్పెసిఫికేషన్లు :
మోటో (Moto G85 5G) ప్రీమియం డిజైన్, లెదర్ బ్యాక్ ఫినిషింగ్ కలిగి ఉంది. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉంది. హుడ్ కింద 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.
Read Also : Jio Offer : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఈ 2 జియో ప్లాన్లతో ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP, 8MP కెమెరాలతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ అనువైన 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మోటో G85 5G ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.