Motorola Edge 30 Series : మోటోరోలా నుంచి ఎడ్జ్ 30 సిరీస్ వస్తోంది.. ఇండియాలో ఈ నెల 13నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Motorola Edge 30 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఎడ్జ్ సిరీస్‌ను రెండు కొత్త వేరియంట్లలో తీసుకొస్తోంది. లెనోవా (Lenovo) యాజమాన్యంలోని కంపెనీ ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra)ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది.

Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion to be launched in India on September 13

Motorola Edge 30 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) ఎడ్జ్ సిరీస్‌ను రెండు కొత్త వేరియంట్లలో తీసుకొస్తోంది. లెనోవా (Lenovo) యాజమాన్యంలోని కంపెనీ ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra)ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. Edge 30 Fusion వేరియంట్‌తో పాటు అల్ట్రా ప్రీమియం (Motorola Edge 30 Ultra) డివైజ్ కూడా రిలీజ్ చేస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 13న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.

మోటోరోలాఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra) 200-MP ప్రైమరీ సెన్సార్, 144Hz రిఫ్రెష్ రేట్, మరిన్నింటికి సపోర్ట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. Edge 30 Ultra ప్రీమియం కొనుగోలుదారులకు ప్రత్యేకంగా కంపెనీ రూపొందించింది. Edge Fusion 30 నెక్స్ట్ పవర్ ఫుల్ మిడ్-రేంజర్‌గా మారవచ్చు. ఎందుకంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888+ SoC, 144Hz OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండు డివైజ్‌ల అంచనా ధర, ఇతర కీలక స్పెసిఫికేషన్‌ల గురించి ఓసారి లుక్కేయండి.

Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion to be launched in India on September 13

Motorola Edge 30 Ultra, Fusion ధర (అంచనా) :
Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యాయి. Edge 30 Fusion ఐరోపాలో EUR 600 (సుమారు రూ. 47,850) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. Edge 30 Fusion డివైజ్ కూడా Cosmic Grey, Aurora White, Solar Gold, and Neptune Blue వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. వేగన్ లెదర్ ఎండ్ కలిగి ఉంది. Edge 30 Ultra ధర EUR 899.99 (సుమారు రూ. 72,900)గా ఉండనుంది. స్టార్‌లైట్ వైట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తుంది.

Motorola Edge 30 Ultra, Fusion స్పెసిఫికేషన్లు ఇవే :
Moto Edge 30 Ultra 6.67-అంగుళాల Full-HD+ OLED డిస్‌ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా 5తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌తో 12GB వరకు LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. Motorola Edge 30 Fusion 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.55-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888+ SoC ద్వారా 12GB వరకు LPDDR5 RAMతో వస్తుంది.

Motorola Edge 30 Ultra, Motorola Edge 30 Fusion to be launched in India on September 13

కెమెరా పరంగా చూస్తే.. Edge 30 Fusion 50-MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13-MP అల్ట్రావైడ్, 2-MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, 32-MP ఫ్రంట్ కెమెరా ఉంది. Edge 30 Ultra కూడా ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 200-MP ప్రైమరీ సెన్సార్, 50-MP సెన్సార్, 12-MP సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 60-MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Read Also : Motorola New Edge : మోటోరోలా నుంచి న్యూ ఎడ్జ్ సిరీస్ వస్తోంది.. సెప్టెబర్ 8న లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?