Motorola Edge 50 Pro Sale : భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో సేల్.. ఫీచర్లు అదుర్స్, లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?

Motorola Edge 50 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50ప్రో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు, లాంచ్ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Motorola Edge 50 Pro Sale : భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో సేల్.. ఫీచర్లు అదుర్స్, లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?

Motorola Edge 50 Pro Now Available for Purchase in India

Motorola Edge 50 Pro Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. కంపెనీ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా భారత్‌లో కొనుగోలు చేయొచ్చు.

Read Also : Tesla Robotaxi : ఎట్టకేలకు భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది.. బిగ్ హింట్ ఇచ్చిన ఎలన్ మస్క్.. రోబోటాక్సీ లాంచ్ డేట్ రివీల్ చేశాడుగా!

ఈ హ్యాండ్‌సెట్ గతవారమే 3 కలర్ ఆప్షన్లు, 2 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 1.5కె పోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 125డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధర, సేల్ ఆఫర్లు :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 31,999 (68డబ్ల్యూ ఛార్జర్‌తో) పొందవచ్చు. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999కు పొందవచ్చు. లాంచ్ ఆఫర్‌గా బేస్ వేరియంట్ ధర రూ. 27,999, 12జీబీ ర్యామ్ వేరియంట్ (125డబ్ల్యూ ఛార్జర్‌తో) రూ. 31,999కు పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్ బ్యూటీ, లక్స్ లావెండర్, మూన్‌లైట్ పెర్ల్ షేడ్స్‌లో లభిస్తుంది. ఆసక్తి గల కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్‌లో ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా మోటోరోలా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై సేల్ ఆఫర్‌లలో పాత డివైజ్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు రూ. 2వేల తగ్గింపు ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లు, ఇఎంఐ లావాదేవీలతో ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 2,250 తగ్గింపు పొందవచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్ రూ. 3,084 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన పూర్తి లావాదేవీలకు రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఆండ్రాయిడ్ 14-ఆధారిత హాలో యూఐపై రన్ అవుతుంది. మూడు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5కె పోల్డ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 2వేల నిట్స్ గరిష్ట స్థానిక బ్రైట్‌నెస్ లెవల్ హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ని కలిగి ఉంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 10ఎంపీ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ సపోర్టు కలిగి ఉంది.

ఫ్రంట్ సైడ్ క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీ, ఆటో ఫోకస్‌తో కూడిన 50ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 4,500ఎంఎహెచ్ బ్యాటరీతో 125డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 125డబ్ల్యూ ఛార్జర్ 12జీబీ ర్యామ్ వేరియంట్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్ ఆప్షన్, బాక్స్‌లో 68డబ్ల్యూ ఛార్జర్‌ను కలిగి ఉంది.

Read Also : iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్.. ఐఫోన్ 15 ప్లస్ కన్నా చిన్న బ్యాటరీతో రావొచ్చు!