Motorola Edge 50 Ultra
Motorola Edge 50 Ultra : మోటోరోలా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన డిస్కౌంట్.. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ సొంతం (Motorola Edge 50 Ultra) చేసుకోవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ టాప్ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 14వేలకు పైగా తగ్గింపుతో లభ్యమవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ప్రీమియం డిజైన్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G డీల్ :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G ఫోన్ రూ.59,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.48,199కి లిస్ట్ అయింది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాపై రూ.11,800 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.2,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత హ్యాండ్‌సెట్ ట్రేడ్ చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు.
Read Also : iQOO 12 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఐక్యూ 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ గేమింగ్ ఫోన్ డీల్ మీకోసమే..!
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 6.7-అంగుళాల సూపర్ 1.5K pOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద, ఈ స్మార్ట్‌ఫోన్ 12GB LPDDR5X ర్యామ్, 512GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఈ మోటోరోలా ఫోన్ 125W ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రాలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ సెన్సార్‌తో 64MP టెలిఫోటో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.