Motorola Edge 60 Stylus Sale : మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫస్ట్ సేల్.. ఇలా చేస్తే ఫ్లిప్‌‌కార్ట్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

Motorola Edge 60 Stylus Sale : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ కొత్త మోటోరోలా ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 60 Stylus Sale

Motorola Edge 60 Stylus Sale : మోటోరోలా లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్, ఎడ్జ్ 60 స్టైలస్ భారత మార్కెట్లో ఈరోజు (ఏప్రిల్ 23) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అధికారికంగా అమ్మకానికి వచ్చింది.

Read Also : AI Cure Diseases : వచ్చే 10 ఏళ్లలో AI అన్ని వ్యాధులను అంతం చేయగలదు : గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు..!

లాంచ్ అయిన కొద్ది రోజులకే ఈ స్టైలస్ ఫోన్ అద్భుతమైన ఆఫర్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తుంటే ఇదే సరైన సమయం. ఇంతకీ ఈ మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ధర, ప్రారంభ ఆఫర్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్పెషిఫికేషన్లు కలిగి ఉంది. సింగిల్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీని అందిస్తుంది. ఈ ఫోన్ జిబ్రాల్టర్ సీ, సర్ఫ్ ది వెబ్ అనే రెండు ప్యాంటన్-సర్టిఫైడ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. బ్లూ కలర్ షేడ్స్, ఒకటి డీప్, మరొకటి చాలా బ్రైట్‌గా ఉంటుంది. కొన్ని బ్యాంకు సంబంధిత డిస్కౌంట్లను కూడా అందిస్తుంది.

యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ యేతర చెల్లింపులపై రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు. మీరు IDFC బ్యాంక్ ఈఎంఐ ఎంచుకుంటే రూ. 1,500 తగ్గింపు పొందవచ్చు. అదనపు వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ధర రూ. 22,999 నుంచి లభ్యమవుతుంది. ప్రస్తుతానికి ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవు.

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లోకి వస్తుంది. మోటోరోలా స్టైలస్ మోడల్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. స్క్రీన్ 3000 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.

మోటోరోలా స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 2 ప్రాసెసర్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అదనపు స్టోరేజ్ విషయానికి వస్తే.. 1TB వరకు సపోర్ట్ చేసే మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. రెండు ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందుకోనుంది.

Read Also : Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ చూశారా? అమెజాన్‌లో ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

కెమెరా ఫీచర్లు :
50MP ప్రైమరీ కెమెరా (సోనీ లైటియా 700C సెన్సార్) కలిగి ఉంది. 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 32MP ఫ్రంట్ సైడ్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ MIL-STD గ్రేడ్ డ్యూరబిలిటీ, Wi-Fi 6, 12 5G బ్యాండ్ సపోర్ట్, డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు వంటి కొన్ని ఇతర ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ బరువు 191 గ్రాములు, వీగన్ లెదర్ బ్యాక్ కలిగి ఉంది. గాజు లేదా ప్లాస్టిక్ ఫినిషింగ్‌లతో పోలిస్తే.. చేతిలో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.