Motorola G57 Power 5G (Image Credit To Original Source)
Motorola G57 Power 5G : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా G57 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ రూ. 14,999కే లభిస్తోంది. వాస్తవానికి, ఈ మోటోరోలా ఫోన్ అసలు రూ. 17,999 ధర ఉండగా ఇప్పుడు 16శాతం తక్కువకే లభిస్తోంది.
50MP ఏఐ కెమెరా, 120Hz ఫుల్ HD+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్, 7000mAh బ్యాటరీతో వస్తుంది. మీ దగ్గర
యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే మరింత ఇంకా తగ్గింపు పొందవచ్చు.
రూ. 15వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే.. కొత్తగా లాంచ్ అయిన మోటోరోలా G57 పవర్ 5జీ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఆప్షన్. అలాగే, స్పీడ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP కెమెరా, భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ 16శాతం ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తోంది. త్వరలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. అంతకన్నా ముందే ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరతో లభిస్తోంది. పూర్తి ధర, ఫీచర్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
మోటోరోలా G57 పవర్ 5G డీల్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటోరోలా ఫోన్ కేవలం రూ.14,999కే అందిస్తోంది. అసలు ధర రూ. 17,999 ఉండగా రూ.3వేల వరకు తగ్గింపు అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డు ఉంటే అదనంగా రూ. 750 తగ్గింపుతో ఈ ఆఫర్ పొందవచ్చు.
Motorola G57 Power 5G (Image Credit To Original Source)
కంపెనీ రూ. 12,150 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ డీల్ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుంది.
మోటోరోలా G57 పవర్ 5G బెస్ట్ ఫీచర్లు :
ఈ మోటోరోలా 5Gలో అద్భుతమైన ఫీచర్లతో పాటు భారీ 7000mAh బ్యాటరీ ఉంది. లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందిస్తుంది.
మోటోరోలా ఫోన్ IP64 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్, ఫ్లెక్సిబుల్ 50MP ఏఐ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఈ పవర్‌ఫుల్ 5G ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ గెచర్ కంట్రోల్ కూడా ఉంది.