Samsung Galaxy A07 5G : వారెవ్వా.. కొత్త శాంసంగ్ గెలాక్సీ A07 5G వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A07 5G : కొత్త శాంసంగ్ ఫోన్ భలే ఉంది.. 6000mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
Samsung Galaxy A07 5G (Image Credit To Original Source)
- శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ లాంచ్
- శాంసంగ్ గెలాక్సీ A07 4జీకి అప్‌గ్రేడ్ వెర్షన్
- 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ. 15,800
- 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ. 17,200
Samsung Galaxy A07 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ లవర్స్ కోసం సౌత్ కొరియన్ దిగ్గజం థాయిలాండ్‌లో శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఈ శాంసంగ్ ఎ-సిరీస్ లైనప్‌కు కొత్త 5జీ ఆప్షన్ కూడా ఉంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్‌లతో శాంసంగ్ రీజనల్ వెబ్‌సైట్‌లో కనిపించింది.
గత ఏడాది ఆగస్టులో లాంచ్ అయిన గెలాక్సీ A07 4జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. బడ్జెట్ 5జీ సెగ్మెంట్‌లో భారీ బ్యాటరీ, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్టును అందిస్తుంది. భారత మార్కెట్లో గత అక్టోబర్ నెలలో గెలాక్సీ A07 4జీ వేరియంట్ ఇతర గెలాక్సీ F07 4జీ, గెలాక్సీ M07 4జీతో పాటు లాంచ్ అయింది.
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ధర, లభ్యత :
ప్రస్తుతం థాయిలాండ్‌లో శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో లభిస్తోంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర THB 5,499 (సుమారు రూ. 15,800)గా అందిస్తుంది.
అయితే, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర THB 5,999 (సుమారు రూ. 17,200)కు అందిస్తోంది. ఈ ఫోన్ కంపెనీ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయిన వివిధ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా బ్లాక్, లైట్ వైలెట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Samsung Galaxy A07 5G (Image Credit To Original Source)
శాంసంగ్ గెలాక్సీ A07 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ 6.7-అంగుళాల HD+(720×1,600 పిక్సెల్స్) పీఎల్ఎస్ ఎల్‌సీడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. స్క్రీన్ సెల్ఫీ కెమెరాతో వాటర్ డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 SoC మాదిరిగా 6ఎన్ఎమ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6GB వరకు ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.
లిస్టింగ్ ప్రకారం.. స్పెషల్ స్లాట్‌తో మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్ కార్డ్‌లకు సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో శాంసంగ్ వన్ యూఐ 8.0తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6 మెయిన్ ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లతో పాటు 6 ఏళ్ల సేఫ్టీ ప్యాచ్‌లను కూడా అందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే..
శాంసంగ్ గెలాక్సీ A07 5జీలో ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ 8MPసెల్ఫీ షూటర్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A07 5జీ ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 25W వరకు వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఆప్షన్లలో 5G సబ్-6,4G LTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.3 జీపీఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ IP54 రేటింగ్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A07 5జీ స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్ శాంసంగ్ కీ ఐలాండ్ డిజైన్‌తో వస్తుంది. పవర్ వాల్యూమ్ బటన్లు కూడా ఉన్నాయి. పవర్ బటన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌గా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 167.4×77.4×8.2mm కొలతలు, 199 గ్రాముల బరువు ఉంటుంది.
