Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ఈ శాంసంగ్ S25 అల్ట్రా 5G ఫోన్ ఎందులో తక్కువంటే? ఇలా చెక్ చేయండి!
Samsung Galaxy S25 Ultra 5G : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది.. ఈ అద్భుతమైన డీల్స్ ఎందులో తక్కువ ధరకే లభిస్తుందో తెలుసుకుందాం..
Samsung Galaxy S25 Ultra 5G (Image Credit To Original Source)
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ తగ్గింపు
- 200MP కెమెరా, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
- ప్రారంభ ధర రూ. 1,29,999, రూ. 22వేల వరకు ఫ్లాట్ డిస్కౌంట్
- రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
Samsung Galaxy S25 Ultra 5G : కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ కావాలా? ప్రీమియం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్.. ప్రస్తుతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌లలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.
ఈ శాంసంగ్ ఫోన్‌లో 200MP కెమెరా, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ రెండు ప్లాట్‌ఫారాల్లో తక్కువ ధరకే ఉన్నప్పటికీ ఎందులో ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్ : శాంసంగ్ S25 అల్ట్రా 5G తక్కువ ధరకు ఎలా? :
శాంసంగ్ గత ఏడాదిలో ఈ ఫోన్‌ను రూ. 1,29,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ రూ. 1,07,999కే అందిస్తోంది. అంటే.. రూ. 22వేల వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లకు 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.
మరోవైపు, అమెజాన్ ఈ శాంసంగ్ S25 అల్ట్రా 5జీ ఫోన్‌ను కేవలం రూ. 1,07,250కే అందిస్తోంది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో ఫోన్ ధరలో పెద్దగా తేడా లేదు. అమెజాన్ ఈ ఫోన్‌ను అతి తక్కువ ధరకు ఆఫర్ చేస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందిస్తోంది.

Samsung Galaxy S25 Ultra 5G (Image Credit To Original Source)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో ఫోన్‌పై రూ. 1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G టాప్ ఫీచర్లు :
- 6.9-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్
- క్వాల్కమ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్
- 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లు
- 200MP ప్రైమరీ కెమెరా ఆప్షన్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్
- 5x ఆప్టికల్ జూమ్, 50MP టెలిఫోటో లెన్స్, 10MP 3x టెలిఫోటో రియర్ సెటప్
- ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఆప్షన్
- 5,000mAh బ్యాటరీ సపోర్టు, 45W వైర్డ్ ఛార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్టు
