Tata Punch Facelift : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈ నెల 13నే లాంచ్.. స్పెషల్ ఫీచర్లు అదుర్స్.. ఈ కార్లతో పోటీగా..!
Tata Punch Facelift : టాటా మోటార్స్ నుంచి కొత్త కారు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది. ఈ నెల 13న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి వివరాలివే..
Tata Punch Facelift (Image Credit To Original Source)
- జనవరి 13నే కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
- 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ టెయిల్‌లైట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM
- కాంపాక్ట్ SUV కేటగిరీలో రానున్న అప్ డేట్ వెర్షన్
- హారియర్, సఫారీలలో మాదిరిగానే ఫీచర్లు
Tata Punch Facelift : కొత్త టాటా కారు వచ్చేస్తోంది. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త కారు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది. జనవరి 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అనేది కాంపాక్ట్ SUV కేటగిరీలో రానున్న అప్ డేట్ వెర్షన్.
అయితే, టాటా పంచ్ లాంచ్‌కు ముందే కంపెనీ కొత్త పంచ్, అన్ని వేరియంట్‌ల వివరాలను షేర్ చేసింది. మీరు కొత్త టాటా పంచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అన్ని ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ :
కొత్త పంచ్ పాత పంచ్ మాదిరిగా ఉంటుంది. కానీ, కంపెనీ కొన్ని చిన్న మార్పులు చేసింది. కారు ఫ్రంట్ సైడ్ కొత్త లైటింగ్ ఫీచర్లతో రీడిజైన్ హెడ్‌లైట్‌లు ఉన్నాయి. డే టైమ్‌లో రన్నింగ్ లైట్లు ఇప్పుడు హారియర్, సఫారీలలో మాదిరిగానే ఉన్నాయి. కారు ఫ్రంట్ సైడ్ పియానో బ్లాక్ ఫినిషింగ్, కొత్త లోయర్ గ్రిల్ కొత్త స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. కొత్త పంచ్‌ను మరింత బోల్డ్‌గా ఆకర్షణీయంగా కనిపించనుంది.

Tata Punch Facelift (Image Credit To Original Source)
కొత్త టాటా పంచ్ బ్యాక్ సైడ్ కూడా రీడిజైన్ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగంలో భారీగా మార్పులు వచ్చాయి. కారులో టాటా లోగోతో కొత్త ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. టోగుల్-టైప్ స్విచ్‌లు రీప్లేస్ బటన్లు ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో 7-అంగుళాల TFT డిస్‌ప్లే కూడా ఉంది. కారు లోపలి నుంచి అద్భుతమైన లుక్ అందిస్తుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు :
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ టెయిల్‌లైట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, కార్నరింగ్ ఫంక్షన్‌తో ABS, LED ఫాగ్ ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అనేక అడ్వాన్స్ ఫీచర్లతో వస్తుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ :
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 118bhp, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే ఉన్న పాత మోడల్ మాదిరిగానే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తుంది. ఈ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లో ప్రస్తుత SUVలతో నేరుగా పోటీ పడుతుంది. అందులో హ్యుందాయ్ ఎక్స్‌టర్, కొత్త టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
