Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్.. 36 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్!

Jio Cheapest Plan : రిలయన్స్ జియో సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. ఈ లిమిటెడ్ ఫెస్టివల్ ఆఫర్ 36 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్.. 36 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్!

Jio Cheapest Plan (Image Credit To Original Source)

Updated On : January 12, 2026 / 4:55 PM IST
  • జియో కొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది
  • జియో రూ. 450తో అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్
  • ఈ ఫెస్టివల్ రీఛార్జ్ ప్లాన్ తో 2GB డేటా, ఓటీటీ బెనిఫిట్స్

Jio Cheapest Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మిలియన్ల మంది యూజర్ల కోసం సరికొత్త, సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. అయితే, ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్ జియో పండగ ఆఫర్ కింద రూ. 450కు అందుబాటులో ఉంది.

ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకంగా నెలవారీ, త్రైమాసిక ప్లాన్ల మధ్య ఎంచుకోవచ్చు. అలాగే డేటా, కాలింగ్ అనేక ఇతర బెనిఫిట్స్‌తో 36 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ కొత్త చీపెస్ట్ ప్లాన్‌ ఎలా పొందాలో ఇప్పడు వివరంగా పరిశీలిద్దాం..

Jio Cheapest Plan

Jio Cheapest Plan

రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా :
రూ. 450 ప్లాన్‌తో జియో రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తుంది. మొత్తం 36 రోజుల్లో 72GB డేటాను అందిస్తుంది. అదనంగా, 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న యూజర్లు జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : Best Affordable Camera Phones : 2026లో వ్లాగింగ్ కోసం 5 బెస్ట్ సరసమైన కెమెరా ఫోన్లు.. DSLR రేంజ్‌లో ఫొటోలు, వీడియోలు.. ధర ఎంతంటే?

ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ గూగుల్ జెమిని ప్రో :
ఈ కొత్త జియో ప్లాన్ కేవలం కాలింగ్ డేటాను మాత్రమే కాదు.. 50GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ అందించే జియోఏఐక్లౌడ్ కూడా అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్‌లో 18 నెలల ఫ్రీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా అందిస్తుంది.

ఓటీటీ బెనిఫిట్స్ :
ఈ జియో ప్లాన్‌లో ఫ్రీ జియోటీవీ ఎంటర్‌టైన్మెంట్ కోసం 3 నెలల జియోహాట్‌స్టార్, మొబైల్/టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. అయితే, రెండో, మూడో నెలలో జియోహాట్‌స్టార్ బెనిఫిట్స్ కావాలంటే ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ గడువు ముగిసిన 48 గంటలలోపు రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కొత్త యూజర్లలో జియోహోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై 2 నెలల ఫ్రీ ట్రయల్‌ కూడా అందిస్తుంది.