జియో ఆఫర్.. Cashback కూడా : Motorola వన్ యాక్షన్.. ధర ఎంతంటే?

మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. ఫ్లిప్ కార్ట్‌లో ఆగస్టు 30, 2019 నుంచి ఎక్స్ క్లూజీవ్‌గా Motorola one action స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

  • Publish Date - August 23, 2019 / 12:52 PM IST

మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. ఫ్లిప్ కార్ట్‌లో ఆగస్టు 30, 2019 నుంచి ఎక్స్ క్లూజీవ్‌గా Motorola one action స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

అమెరికన్ మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్స్ మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. అదే.. మోటరోలా వన్ యాక్షన్ స్మార్ట్ ఫోన్. వీడియో కెమెరాపై ప్రత్యేక దృష్టిపెట్టిన మోటరోలా.. వన్ యాక్షన్ డివైజ్‌ను తీసుకుచ్చింది. మోటరోలా వన్ విజన్ మాదిరిగా ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి.

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం Flipkartలో ఆగస్టు 30, 2019 నుంచి ఎక్స్ క్లూజీవ్‌గా Motorola one action స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి జియో ఆఫర్ అందించనుంది. అదనంగా 125GBతో పాటు రూ.22వందల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. 

విదేశీ మార్కెట్లలో ఇప్పటికే మోటరోలా వన్ యాక్షన్ రిలీజ్ అయింది. ఆండ్రాయిడ్ వన్ ఫోన్ కూడా. రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ అప్ డేట్స్ పొందవచ్చు. మోటరోలా వన్ యాక్షన్ కంటే ముందు ఇండియా మార్కెట్లో జూన్ నెలలో మోటరోలా వన్ విజన్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది.

దీని ప్రారంభ ధర రూ.19వేల 999తో మార్కెట్లో లభ్యం అవుతోంది. Motorola one action స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.13వేల 999తో లభ్యం కానుంది. 16MP అల్ట్రా వైడ్ సెన్సార్ వీడియో ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ తో 117 డిగ్రీల వ్యూలో అల్ట్రా వైడ్ వీడియోలను రికార్డు చేయవచ్చు. వర్టికల్ ఫార్మాట్ లో వీడియోలు షూట్ చేసి.. హర్జింటెల్ ఫార్మాట్ లో వీడియోలు చూడొచ్చు. 

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 6.3 అంగుళాలు డిస్‌ప్లే (2520×1080) 21:9 అస్పెక్ట్ రేషియో 
* సెల్ఫీ కెమెరా పంచ్ హోల్ స్టయిల్
* శాంసంగ్ Exynos 9609 ప్రాసెసర్
* 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ
* 10W ఫాస్ట్ ఛార్జింగ్ 
* ఆండ్రాయిడ్ పై + ఆండ్రాయిడ్ 9
* 16MP అల్ట్రా వైడ్ సెన్సార్
* అల్ట్రా వైడ్ 117 డిగ్రీస్ వ్యూ 
* 12MP మెయిన్ కెమెరా
* 5MP డెప్త్ సెన్సార్
* డ్యుయల్ LED ఫ్లాష్
* 12MP సెల్ఫీ కెమెరా