Mumbai Richest City : బీజింగ్‌ను అధిగమించి.. ఆసియాలోనే సంపన్న నగరంగా ముంబై..!

Mumbai is the Richest City in Asia : ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా అవతరించింది. ఈ సంవత్సరంలో 26 మంది బిలియనీర్లతో ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకి ఆసియా బిలియనీర్ రాజధానిగా నిలిచింది.

Mumbai is the Richest City in Asia : సంపన్నుల నగరాల్లో భారత కీలక మైలురాయిని దాటింది. ఆసియాలోనే అత్యంత సంపన్న నగరాలు జాబితాలో ముంబై సిటీ బీజింగ్ దాటేసింది. శ్రీమంతుల జాబితాలో ఆసియా ఖండంలోనే రిచెస్ట్ క్యాపిటల్‌గా ఉన్న బీజింగ్‌ను ముంబై వెనక్కి నెట్టింది.బీజింగ్‌లో 91 మందితో పోలిస్తే.. ముంబైలో బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 92గా ఉంది.

Read Also : Apple iPhone 14 discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.57వేలకే సొంతం చేసుకోవచ్చు!

ముంబై సంపద గత సంవత్సరంలో 47 శాతం పెరిగింది. బీజింగ్ 28 శాతం క్షీణతను మించిపోయింది. అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రంగా ముంబై తన స్థానాన్ని సుస్థిరం చేసింది. హురున్ నివేదిక ప్రకారం.. చైనాలో 55 మందితో పోలిస్తే.. ఈ సంవత్సరం భారత్‌లో 94 మంది కొత్త బిలియనీర్లు చేరారు.

ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా అవతరించింది. ఈ సంవత్సరంలో 26 మంది బిలియనీర్లతో ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకి ఆసియా బిలియనీర్ రాజధానిగా నిలిచింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం.. పామ్ బీచ్, ఇస్తాంబుల్, మెక్సికో సిటీ, మెల్‌బోర్న్ హురున్ టాప్ 30 నగరాల్లోకి ప్రవేశించాయి.

అత్యధిక బిలియనీర్లతో చైనా టాప్ :
ప్రపంచంలోనే అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశంగా చైనా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, ఇండియా ఉన్నాయి. చైనాలో 814 మంది బిలియనీర్లు ఉండగా, అమెరికా, భారత్‌లో 800 మంది బిలియనీర్లు, ఉన్నారు. మరోవైపు ప్రపంచ టాప్ 10 సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఇక, గౌతమ్ అదానీ సంపద 62 శాతం పెరిగి 86 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 15వ స్థానానికి చేరుకుంది.

ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ మూడో స్థానం : 
ప్రపంచంలోని సంపన్నుల వ్యక్తుల జాబితాలో 271 మంది సంపన్నులతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆసియాలోని నెంబర్‌వన్ బిలియనీర్ల రాజధానిగా బీజింగ్‌ను ముంబై దాటేయడంతో ప్రపంచ జాబితాలో భారత్‌కు మూడో స్థానం దక్కింది. అత్యధిక ఆస్తులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్‌కు సంపన్న జాబితాలో మూడోస్థానం దక్కడంలో కీలకంగా నిలిచారు.

ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం 3 వేల 279 మంది బిలియనీర్లు ఉన్నారు. కేవలం, 2023లోనే 167 మంది బిలియనీర్లు కుబేరుల జాబితాలో చేరారని గ్లోబల్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇండియాలోనే గత సంవత్సరం 84 మంది బిలియనీర్లు సంపన్నుల జాబితాలో చేరారు. మరోవైపు.. భారత రాజధాని ఢిల్లీ తొలిసారి టాప్ 10 సంపన్న నగరాల జాబితాలో చేరింది.

చైనాలో 155 మంది సంపన్నులు తగ్గారట. ఈ దెబ్బకు ముంబై సంపన్నుల జాబితాలో బీజింగ్‌ను వెనుక్కి నెట్టి ఆసియాలో నెంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు వందమంది బిలియనీర్లు తయారయ్యారంటే భారత్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ ఏంటో తెలుస్తోంది అంటున్నారు ప్రపంచ ఆర్థికవేత్తలు.

Read Also : China Teen Zhou Chuna : అభిమాన నటిలా కనిపించాలని 100కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు.. రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన యువతి

ట్రెండింగ్ వార్తలు