Narayana Murthy Parenting Advice : మళ్లీ వివాదాస్పదంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. పేరెంటింగ్ సలహాపై నెటిజన్లు మండిపాటు..!

Narayana Murthy Parenting Advice : నారాయణ మూర్తి పేరెంటింగ్ సలహాతో మరోసారి వివాదాస్పదానికి దారితీసింది.

Narayana Murthy slammed for his parenting advice

Narayana Murthy Parenting Advice : ప్రముఖ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిల్లల విషయంలో తల్లిదండ్రుల గురించి తన ఆలోచనలను పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. టెక్ బాస్ గతంలో యువత కోసం 70 గంటల పని వారానికి చేయాలని సూచించడం వివాదానికి దారితీసింది. ఇప్పుడు, నారాయణ మూర్తి పేరెంటింగ్ సలహాపై కూడా మళ్లీ వివాదాస్పదమైంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

Read Also : Vivo T3 Ultra Launch : అదిరే ఫీచర్లతో వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ చూశారా? భారత్‌లో ధర ఎంతో తెలుసా?

మేమైతే అలానే చేసేవాళ్లం.. నారాయణమూర్తి కామెంట్స్ :
పిల్లలు చదువుపై దృష్టి పెట్టాలని చెబుతూ తల్లిదండ్రులు మాత్రం సినిమాలు చూడలేరని అన్నారు. “తల్లిదండ్రులు వెళ్లి సినిమాలు చూసి.. పిల్లలకు ‘వద్దు, వద్దు, మీరు చదువుకోండి’ అని చెబితే (అది పనికిరాదు)” అని పేర్కొన్నారు. నారాయణ మూర్తి.. తన భార్యతో కలిసి ప్రతిరోజు మూడున్నర గంటలపాటు తమ స్కూల్ రోజుల్లో పిల్లలైన అక్షత, రోహన్ మూర్తితో కలిసి చదివేందుకు ఎలా సమయాన్ని కేటాయించారో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

వారానికి 72 గంటల పని సాధ్యమేనా? నెటిజన్ల ప్రశ్నల వర్షం :
పేరెంటింగ్ సలహాపై నెటిజన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తూ.. “అయితే, తల్లిదండ్రులు మీరు సిఫార్సు చేసినట్లుగా 72 గంటలు పని చేస్తే.. ఇక పిల్లలకు ఎప్పుడు సమయం కేటాయిస్తారు?” అని ప్రశ్నించారు. దీనికి మరో నెటిజన్ “అవును నిజమే.. తల్లిదండ్రులు కూడా వారి 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల ప్రారంభంలో వారి కాలిక్యులాస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. నారాయణ మూర్తి కూడా ఈ వయస్సులో గో లాంగ్ నేర్చుకోవాలి. ప్రతి వారం 70 గంటలు కోడ్ చేయాలి” అని కామెంట్ చేశారు.

“తల్లిదండ్రులు, పిల్లలు సినిమాలు చూడటం మానేయాలి. నైట్ షిఫ్ట్‌లో వారానికి 70 గంటలపాటు తక్కువ జీతంతో సపోర్టు టిక్కెట్‌లను పరిష్కరించాలి.” అని మరో నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. “ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో చదవడానికి గంటలు కేటాయించాలని ఆశించడం సాధ్యపడదు. ప్రత్యేకించి చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఇంటి బాధ్యతలతో చాలా బిజీగా ఉంటారు. అన్ని కుటుంబాలకు ఒకే రకమైన వనరులు లేదా సమయం ఉండదు. ప్రతి ఒక్కరికి ఈ విధానం సరికాదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.

అంతకుముందు, భారత్‌లో వర్క్ కల్చర్ మరింత మెరుగుపర్చేలా యువకులు వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని నారాయణ మూర్తి వివాదాస్పదంగా సూచించారు. “నేను ఉదయం 6:20 గంటలకు ఆఫీసులో ఉంటాను. రాత్రి 8:30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరుతాను. వారానికి ఆరు రోజులు పనిచేశాను. నా మొత్తం 40 సంవత్సరాల వృత్తి జీవితంలో, నేను వారానికి 70 గంటలు పనిచేశాను. 1994 వరకు మాకు 6 రోజుల సమయం ఉంటే.. నేను వారానికి కనీసం 85 నుంచి 90 గంటలు పని చేసేవాడిని‘‘ అని ఆయన తెలిపారు.

Read Also : iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కావాలా? ఈ నెల 13 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ధరల వివరాలివే..!

ట్రెండింగ్ వార్తలు