UPI New Rules : యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచే ఈ కొత్త రూల్ వస్తోంది.. ఛార్జ్‌బ్యాక్ సిస్టమ్ ఫీచర్లు, బెనిఫిట్స్ ఇవే..!

UPI New Rules : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New auto chargeback rule for UPI transactions

UPI New Rules : గత కొన్ని ఏళ్లుగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వాడకం భారీగా పెరిగింది. ప్రస్తుత రోజుల్లో రూ.5 నుంచి లక్షల వరకు చెల్లింపులకు యూపీఐ ద్వారానే ఉపయోగిస్తున్నారు. యూపీఐ సౌకర్యం వచ్చినప్పటి నుంచి చాలామంది నగదును వాడకాన్ని తగ్గించేశారు. యూపీఐ ద్వారా చెల్లింపులు కొన్ని సెకన్లలో జరిగిపోతున్నాయి.

యూపీఐని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. భారత్ సహా శ్రీలంక, సింగపూర్, యుఎఇ, భూటాన్, జపాన్, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, న్యూజిలాండ్‌లలో కూడా యూపీఐ వాడకం ప్రారంభమైంది. దాతో అక్కడి భారతీయుల లావాదేవీలు కూడా మరింత సులభతరంగా మారాయి.

Read Also : AC Maintenance Tips : కొత్త ఏసీ కొనాలా? పాత ఏసీనే వాడితే మంచిదా? ఎప్పుడు మార్చితే బెటర్.. తప్పక తెలుసుకోండి..!

ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధన అమల్లోకి :
2025 ఫిబ్రవరి 15 నుంచి యూపీఐకి సంబంధించిన కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. లావాదేవీ క్రెడిట్ కన్ఫర్మేషన్ (TCC), రిటర్న్‌ల ఆధారంగా ఛార్జ్‌బ్యాక్‌లను ఆటోమాటిక్‌గా అంగీకరించడం లేదా తిరస్కరించడం వంటివి ఉంటాయి. ఈ కొత్త రూల్ ఫిబ్రవరి 15 శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ఎన్‌పీసీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది.

యూపీఐ ఛార్జ్‌బ్యాక్ సిస్టమ్ అంటే ఏంటి? :
వివాదం, మోసం లేదా సాంకేతిక సమస్యల కారణంగా పూర్తయిన యూపీఐ లావాదేవీలను యూపీఐ ఛార్జ్‌బ్యాక్ ద్వారా తిరిగి చెల్లించడమే కొత్త విధానం. ఈ ప్రక్రియను చెల్లింపుదారుడి బ్యాంకు తిరిగి పంపుతుంది. బ్యాంక్ అది సరైనదని కనుగొంటే చెల్లింపు యూజర్ అకౌంట్లోకి తిరిగి చెల్లింపు జరుగుతుంది.

ఛార్జ్‌బ్యాక్ సిస్టమ్ ఫీచర్లు :

  • యూపీఐ వివాద పరిష్కార వ్యవస్థ (URCS)లో ఆటోమేటిక్ అంగీకారం లేదా తిరస్కరించే విధానం ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తుంది.
  • కొత్త నియమం బల్క్ అప్‌లోడ్ ఆప్షన్లు, యూనిఫైడ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇంటర్‌ఫేస్ (UDIR)కు మాత్రమే వర్తిస్తుంది. ఫ్రంట్-ఎండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్‌కు వర్తించదు.
  • ఛార్జ్‌బ్యాక్ ఖరారు కావడానికి ముందు లబ్ధిదారుల బ్యాంకులకు లావాదేవీలను సరిచేసుకోనేందుకు సమయం ఉంటుంది.

Read Also : Smart TV Deals : అమెజాన్‌లో స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డీల్స్.. తక్కువ ధరకే నచ్చిన టీవీని ఇంటికి తెచ్చేసుకోండి..!

ఛార్జ్‌బ్యాక్, రీఫండ్ మధ్య తేడా ఏమిటి? :
ఒక యూజర్ యూపీఐ పేమెంట్ పోర్టల్ లేదా ఏదైనా సర్వీసుకు రిక్వెస్ట్ చేసినప్పుడు అది పరిశీలించిన తర్వాత రీఫండ్ ప్రక్రియ జరుగుతుంది. కానీ, యూపీఐ ఛార్జ్‌బ్యాక్‌లో, ఏదైనా తప్పు లావాదేవీ తర్వాత, వినియోగదారులు Paytm, Google Pay, PhonePe వంటి యూపీఐ లావాదేవీ యాప్‌లలో రిపోర్టు చేయడానికి బదులుగా వారి బ్యాంకును సంప్రదించాలి. ఆ తరువాత బ్యాంక్ మీ కేసును దర్యాప్తు చేసి దానిపై ఛార్జ్‌బ్యాక్ కోసం చర్య తీసుకుంటుంది.

బ్యాంకులపై ప్రభావం ఉంటుందా? :
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అన్ని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సభ్య బ్యాంకుల అధికారులను కోరింది. ఈ కొత్త నియమం వివాద నిర్వహణను క్రమబద్ధీకరించడం, జరిమానాలను తగ్గించడంతో పాటు పరిష్కారాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.