Bajaj Pulsar 125 Variants (Image Credit To Original Source)
Bajaj Pulsar 125 Variants : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో అతి చౌకైన ధరకే బజాజ్ పల్సర్ బైక్ వచ్చేసింది. ప్రముఖ టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్‌ను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే మార్కెట్లో బజాజ్ పల్సర్ బైకులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పుడు, బజాజ్ పల్సర్ 125 అనే కొత్త మోడల్‌ను కూడా తీసుకొచ్చింది. గతంలో కన్నా మరింత స్టైలిష్, సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది. బజాజ్ పల్సర్ 125 బైక్ వేరియంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బజాజ్ పల్సర్ 125 ధరలివే :
బజాజ్ పల్సర్ 125 రెండు కొత్త వేరియంట్లను కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఫస్ట్ వేరియంట్ సింగిల్-సీట్ వేరియంట్ ధర రూ. 89,910 (ఎక్స్-షోరూమ్). రెండో వేరియంట్ స్ప్లిట్-సీట్ వేరియంట్ ధర రూ. 92,046 (ఎక్స్-షోరూమ్)కు లభిస్తోంది.
బజాజ్ పల్సర్ 125 కొత్త డిజైన్, ఫీచర్లు :
బజాజ్ పల్సర్ 125 కొత్త వేరియంట్‌లో కొన్ని మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బైక్ ఫ్రంట్ సైడ్ కంపెనీ కొత్త డిజైన్ ఇచ్చింది. హాలోజన్ ల్యాంప్‌లను ఎల్ఈడీలతో రిప్లేస్ చేసింది. టర్న్ ఇండికేటర్లు కూడా ఎల్ఈడీగా కనిపిస్తున్నాయి. బైక్ మరింత స్టయిలీష్‌గా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
బాడీ ప్యానెల్‌లపై కొత్త గ్రాఫిక్స్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త బజాజ్ పల్సర్ 125 మోడల్ ఇప్పుడు అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో బ్లాక్ గ్రే, బ్లాక్ రేసింగ్ రెడ్, బ్లాక్ సియాన్ బ్లూ టాన్ బీజ్‌తో రేసింగ్ రెడ్ ఉన్నాయి.
ఫీచర్లను పరిశీలిస్తే.. కొత్త బజాజ్ పల్సర్ 125లో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ (స్టాండర్డ్), బ్యాక్ డ్రమ్, కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS), టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ నైట్రోక్స్ గ్యాస్-చార్జ్డ్ ట్విన్ షాక్‌లు ఎల్ఈడీ లైటింగ్ ఉన్నాయి. పల్సర్ బరువు సుమారు 140 కిలోల నుంచి 146 కిలోలు మధ్య ఉంటుంది.
బజాజ్ పల్సర్ 125 ఇంజిన్ :
కొత్త బజాజ్ పల్సర్ 125 124.4cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ 124.4cc ఇంజిన్ 11.64bhp, 10.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.