Best Mileage Cars : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. రూ. 6 లక్షల లోపు టాప్ 3 బెస్ట్ మైలేజ్ కార్లు.. అల్టిమేట్ గైడ్ మీకోసం..!
Best Mileage Cars : రూ. 6 లక్షల లోపు బడ్జెట్‌లో సరసమైన కార్లు కావాలా? మీకు అద్భుతమైన మైలేజీని అందించే కార్ల లిస్టును ఓసారి లుక్కేయండి..
Best Mileage Cars
- రూ. 6 లక్షల బడ్జెట్ ధరలో 3 బెస్ట్ మైలేజీ అందించే కార్లు ఇవే
- టాటా టియాగో కారు ధర రూ. 4.57 లక్షలు మాత్రమే
- అత్యంత సరసమైన ధరకే హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
- మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షలే
Best Mileage Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 6 లక్షల లోపు అయితే ఇది మీకోసమే.. అత్యంత సరసమైన ధరలో అద్భుతమైన కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్ లోపు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. మీకోసం అనేక కార్లు ఉన్నాయి.
మంచి మైలేజ్ అందించే కార్లలో మీకు నచ్చిన కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ కార్లు అద్భుతమైన మైలేజీతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రూ. 6 లక్షల బడ్జెట్ లోపు అందుబాటులో ఉన్న 3 కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టాటా టియాగో :
ప్రముఖ కార్ల తయారీదారు టాటా నుంచి సరికొత్త టియాగో కూడా తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు రూ. 6 లక్షల బడ్జెట్‌లో టియాగో కారును కొనేసుకోవచ్చు. అత్యంత సరసమైన కార్లలో ఇదొకటి. టాటా టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 లక్షలు మాత్రమే. టాటా టియాగో మైలేజ్ లీటరుకు 26.4 కి.మీ అందిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ :
కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కూడా అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.98 లక్షలు. మైలేజ్ పరంగా చూస్తే.. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ మాన్యువల్ కోసం 18 కి.మీ/లీ పెట్రోల్ AMT కోసం 16 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. CNG మైలేజ్ 27 కిమీ/కిలోగ్రాములు అందిస్తుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ధర :
భారత మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు బాగా పాపులర్. సాధారణ వినియోగదారులు ఎక్కువగా ఈ కారు కొన్నారు. మీరు మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ను రూ. 6 లక్షల బడ్జెట్‌లో ఇంటికి తెచ్చుకోవచ్చు.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షలు ఉంటే.. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పెట్రోల్ ఇంధన మైలేజ్ 25.19 కిమీ/లీ. అందిస్తుంది. CNG ఇంధన ఆర్థిక వ్యవస్థ పరంగా, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ CNG ఇంధన మైలేజ్ దాదాపు 34 కి.మీ/కిమీ అందిస్తుంది.
