×
Ad

New Rental Rules : అద్దెదారులకు బిగ్ రిలీఫ్.. ‘కొత్త అద్దె చట్టం’తో ఇంటి ఓనర్లు జాగ్రత్త.. ఈ 7 రూల్స్ తెలియకపోతే భారీగా నష్టపోతారు!

New Rental Rules : అద్దెదారులకు పండగే.. ఇక అద్దె విషయంలో ఇంటి యజమానుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త అద్దె చట్టం కింద ఈ 7 కీలక రూల్స్ తప్పక తెలుసుకోండి..

New Rental Rules

  • అద్దెదారులకు ఊరటనిచ్చేలా కొత్త అద్దె నియమాలు
  • ఇంటి యజమానులు అద్దెదారులను ఇబ్బంది పెట్టరాదు
  • బెదిరింపులు, బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు
  • ఈ అద్దె నియమాలు ఎవరికి లాభం? ఎవరికి నష్టమంటే?

New Rental Rules : అద్దెదారులకు అతి భారీ గుడ్ న్యూస్.. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అద్దె ఇళ్లకు సంబంధించి కొత్త నియమాలు అమల్లోకి వచ్చేశాయి. ప్రధానంగా హైదరాబాద్‌లోని అద్దెదారులు, ఇంటి యజమానులకు సంబంధించి కొత్త అద్దె నియమాలు మారాయి.

ఈ కొత్త మార్పులతో అద్దె వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది. అలాగే, ఇంటి యజమానులు, అద్దెదారుల హక్కులను రక్షిస్తాయి. ముఖ్యంగా, సెక్యూరిటీ డిపాజిట్లు, అద్దె పెంపు, ప్రాపర్టీ వాడుకోవడంతో పాటు అద్దె ఒప్పందాలపై కఠిన నియమాలు వర్తిస్తాయి. తద్వారా వివాదాలు, అన్యాయ పరిస్థితులను నివారించవచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఇంటి యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇచ్చేటప్పుడు కఠినమైన నిబంధనలను పాటించాలి. అదే సమయంలో అద్దెదారులకు కూడా చట్టపరమైన భద్రత లభిస్తుంది. ఈ మార్పులతో హైదరాబాద్‌లో పెరుగుతున్న అద్దె గృహాల మార్కెట్ మరింత న్యాయపరంగా సక్రమంగా పనిచేసేలా చేస్తాయని భావిస్తున్నారు.

అద్దెచట్టం కింద 7 కీలక నియమాలివే :

1. ఇంటి యజమాని 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలి :
ఇంటి యజమాని అద్దెకు ఇచ్చిన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే 24 గంటలు ముందుగానే అద్దెదారుడికి సమాచారం అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతర సమాయాల్లో ఈ నియమం తప్పక పాటించాలి. ఈ కొత్త రూల్ అద్దెదారుడి ప్రైవసీని కాపాడుతుంది.

2. ఏడాదికి ఒకసారి మాత్రమే అద్దె పెంచాలి :
ఇంటి అద్దెను ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే పెంచాలి. ఇంటి యజమానులు అద్దెను పెంచే ముందు 90 రోజుల లిఖితపూర్వక నోటీసులను అందించాలి.

Read Also : 8th Pay Commission : బిగ్ అప్‌డేట్.. జీతాలు, పెన్షన్లు పెరగాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లు ఈ తేదీలోపు ఇలా చేయండి..

3. సెక్యూరిటీ డిపాజిట్ లిమిట్ :
ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానులు అద్దెదారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ గరిష్టంగా రెండు నెలలకు మించకూడదు. తద్వారా అద్దె ఇంట్లోకి మారేటప్పుడు అద్దెదారులపై ఆర్థిక భారం తగ్గుతుంది.

4. బలవంతంగా అద్దెదారులను ఖాళీ చేయించొద్దు :
ఇంటి యజమానులు అద్దెదారులను బలవంతంగా ఖాళీ చేయొంచొద్దు. కేవలం చట్టబద్ధంగా మాత్రమే అద్దె ఇంటిని ఖాళీ చేయించాలి. ఒకవేళ అద్దె ఇంట్లో ఉండేవారిని ఖాళీ చేయించాలంటే రెంట్ అగ్రిమింట్, సంబంధిత అద్దెచట్టాలలో ఉన్న నియమాలను తప్పక పాటించాలి.

5. రెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ తప్పనిసరి :
రెంట్ అగ్రిమెంట్స్ సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ చేసి అధికారికంగా రిజిస్టర్ చేయించాలి. ఇరువరి మధ్య పారదర్శకంగా ఉంటుంది. ఈ అగ్రిమెంట్‌కు చట్టపరమైన వ్యాలిడిటీ ఉంటుంది.

6. ఇంట్లో రిపేర్లు, నిర్వహణ నియమాలు :
ఇంటి యజమాని 30 రోజుల్లోపు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలి. లేదంటే అద్దెదారులే స్వయంగా ఆ ఇంటి మరమ్మతులు పూర్తి చేసి ఆ ఖర్చును వారి అద్దె నుంచి కట్ చేసుకోవచ్చు.

7. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు :
అద్దెకు ఉండే వారిని ఇంటి యజమానులు వేధింపులకు గురిచేయడం లేదా ఇంటి తాళాలు మార్చడం, వాటర్ లేదా పవర్ కట్ చేయడం లేదా బెదిరించడం వంటివి చేయడం చట్టపరంగా శిక్షార్హం. ఇంటి యజమానులు అద్దెదారులను వేధించకూడదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అద్దె చట్టాల ప్రకారం చట్టపరమైన జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ అద్దె నియమాలు ఎందుకంటే? :
హైదరాబాద్‌లోని అద్దె గృహాల మార్కెట్‌లో ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలలో వేగంగా వృద్ధి చెందుతోంది. కొత్త నియమాలు ఇంటి యజమానులు, అద్దెదారుల మధ్య సానుకూల సంబంధాన్ని సృష్టిస్తుంది. తద్వారా న్యాయమైన అద్దె పద్ధతులను అమలు చేయొచ్చు. ఈ అద్దె మార్పులతో నగరంలో వివాదాలు తగ్గుతాయి. చట్టపరమైన రక్షణ కల్పించవచ్చు. రెంట్ అగ్రిమెంట్ పారదర్శకంగా ఉంటుంది.