×
Ad

New PAN Rule : కొత్త పాన్ రూల్స్.. లగ్జరీ వెడ్డింగ్స్, రూ. లక్షకు పైగా హోటల్ బిల్లులపై ఐటీ నిఘా.. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే!

New PAN Rule: పాన్ కార్డు కొత్త రూల్స్ రాబోతున్నాయి. లగ్జరీగా పెళ్లిళ్లు, 5 స్టార్ హోటళ్లలో రూ. లక్షకు పైగా బిల్లు చేశారంటే ఖతమే.. ఐటీ మీ ప్రతి రూపాయి ఖర్చును ట్రాక్ చేస్తుంది జాగ్రత్త..

  • Published On : February 27, 2026 / 04:13 PM IST

New PAN Rule

  • లగ్జరీ పెళ్ళి ఖర్చులు, రూ. లక్ష పైగా ఫైవ్-స్టార్ బిల్లులు ఐటీ రాడార్‌లో
  • క్యాష్ పేమెంట్లను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా కేంద్రం కొత్త నిబంధనలు
  • రూ. 10 లక్షలకుపైగా క్యాష్ ట్రాన్సాక్షన్లపై ఐటీ ట్రాకింగ్
  • పెద్ద మొత్తంలో క్యాష్ పేమెంట్లు, ఇతర లావాదేవీలపై పాన్ కార్డు తప్పనిసరి

New PAN Rule : సాధారణ ప్రజలు, టాక్స్ పేయర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. అతి త్వరలో కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్లాక్ మనీ, పన్ను ఎగవేతను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో లావాదేవీలపై కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. కొత్త నిబంధనల ముసాయిదా ప్రకారం.. ఇప్పుడు అధిక మొత్తంలో లావాదేవీలకు పాన్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరి కానుంది.

అంతేకాదు.. అనాధికారిక లావాదేవీలపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. ఆర్థిక వ్యవస్థకు పారదర్శకతతో పాటు క్యాష్ పేమెంట్లను పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కొత్త నిబంధనలను తీసుకురానుంది.

మీ ఆదాయం, ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తే మాత్రం ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు మీ ఇంటికే రావచ్చు. 2026లో మారుతున్న ఈ కొత్త ఆర్థిక నియమాలు మీ జేబుతో పాటు జీవనశైలిని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రజలపై ఆర్థిక నిఘా ఎందుకంటే? :
చాలామంది తమ ఆదాయాన్ని దాచేందుకు ప్రయత్నిస్తుంటారు. సంపాదించిన మొత్తం కన్నా తక్కువగా ఐటీ శాఖకు చూపించుకుంటారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లకు బదులుగా క్యాష్ పేమెంట్లు ఎక్కువగా చేస్తుంటారు.

ఇకపై అలా కుదరదు. ఇప్పుడు, డిజిటల్ ఇండియా యుగంలో ప్రభుత్వం ప్రతి రూపాయి ట్రాక్ చేసేందుకు రెడీగా అవుతోంది. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఈ రూల్స్ తీసుకువస్తోంది. తద్వారా భారీ క్యాష్ పేమెంట్లను దాచడం అసాధ్యమే.

రియల్ ఎస్టేట్ రంగంలో భూమి, ఇళ్ల కొనుగోలు, అమ్మకాలలో అక్రమ మనీలాండరింగ్‌ను పూర్తిగా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన వివాహాలు వంటి ఖర్చులను మీరు ప్రకటించిన ఆదాయంతో సరిపోల్చనుంది.

రూ. 10 లక్షలకుపైగా క్యాష్ ట్రాన్సాక్షన్లు :

కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసుకున్నా పాన్ కార్డ్ సమర్పించడం తప్పనిసరి. పరిమితికి మించి చిన్న మొత్తంలో ఎక్కువ లావాదేవీలు చేసే వారికి ఇక కష్టమే. ఇప్పుడు, బ్యాంకు రిపోర్టింగ్ సిస్టమ్ కూడా చాలా అప్‌డేట్ అయింది. అంటే.. ఇకపై చిన్న మొత్తంలో తరచుగా జరిపే లావాదేవీలు చేసేవారు కూడా ఐటీ శాఖ నిఘా నుంచి తప్పించుకోలేరు.

Read Also : Toll Plaza Travel : బిగ్ రిలీఫ్.. నెలకు జస్ట్ రూ. 340 కడితే చాలు.. టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లు అయినా వెళ్లి రావొచ్చు, ఎవరికి బెనిఫిట్?

రియల్ ఎస్టేట్, లగ్జరీ కార్లపై ఐటీ కన్ను :
ప్రాఫర్టీ మార్కెట్లో అతిపెద్ద మార్పు రాబోతుంది. ఇప్పుడు రూ. 20 లక్షల వరకు ఆస్తి లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి కానుంది. మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాలు, సిటీలో సాధారణ ప్లాట్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రభుత్వ రాడార్ కింద ఉంటాయి.

ఇంకా, మీరు రూ. 5 లక్షల కన్నా ఎక్కువ విలువైన మిడ్-సెగ్మెంట్ కారును కొనుగోలు చేస్తే మీ లావాదేవీ నేరుగా ట్రాక్ అవుతుంది. ఇప్పుడు, ఖరీదైన స్పోర్ట్స్ కార్లు మాత్రమే కాదు.. సాధారణ కుటుంబాలు కొనుగోలు చేసే మిడ్-రేంజ్ వాహనాలు కూడా నిఘాలో ఉన్నాయి.

ఐటీ నిఘాలో లైఫ్ స్టయిల్ ఖర్చులు, పెళ్లిళ్లు :

మీరు ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేయడం లేదా పెద్ద కార్పొరేట్ ఈవెంట్ లేదంటే లగ్జరీ మ్యారేజ్ చేసినా రూ. లక్ష కన్నా ఎక్కువ క్రెడిట్ బిల్లు వచ్చినా అన్ని ఖర్చులపై ఇక నుంచి మీ పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీ లైఫ్ స్టయిల్ ఖర్చులపై కూడా డేటాను సేకరిస్తోంది.

అదనంగా, మనీలాండరింగ్‌ను నివారించేందుకు ఏదైనా కంపెనీలో ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఇప్పుడు పాన్ కార్డు తప్పనిసరి. హై ప్రీమియం చెల్లించే పాలసీదారులను గుర్తించడంతో పాటు వారికి అంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఐటీ శాఖ ఈజీగా పసిగట్టగలదు.

ఐటీఆర్, బ్యాంక్ డేటా క్రాస్-చెకింగ్ :
బ్యాంకులు, ఆదాయపు పన్ను శాఖ, రిజిస్ట్రీ ఆఫీసు మధ్య డేటా షేరింగ్ ప్రాసెస్ పూర్తిగా డిజిటల్‌గా మారింది. మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు చూపించినా లేదా మీ బ్యాంక్ అకౌంటులో ఏడాదిలో రూ. 15 లక్షల లావాదేవీలు జరిగినా దొరికిపోతారు.

మీరు అకస్మాత్తుగా రూ. 20 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేసినా ఐటీ సిస్టమ్ వెంటనే ఆటోమేటెడ్ అలర్ట్‌ను జనరేట్ చేస్తుంది. ఆదాయం, వ్యయం మధ్య భారీ వ్యత్యాసం ఉంటే అది నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ మొత్తానికి సంబంధించి మిమ్మల్ని వివరణ అడగవచ్చు.